7,000mAh బ్యాటరీతో వచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్.. వదులుకోవద్దు..
దీని ధర, ఆఫర్ల గురించి తెలుసుకోండి...

Realme GT 7
Realme GT 7 5G: అన్ని ఫీచర్లు ఉండే కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? Realme GT 7 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపుతో ఆఫర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లు అన్ని మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం, అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్ ఆఫర్లతో అమ్మకానికి ఉంది. దీని ధర, ఆఫర్ల గురించి తెలుసుకోండి…
ధర, డిస్కౌంట్ ఆఫర్లు
ఈ 5G ఫోన్ మూడు వేరియంట్లలో వచ్చింది. దీని మొదటి వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.45,999. దీనిపై ప్రస్తుతం ఆఫర్ ఉంది. దీనిని మీరు అమెజాన్ నుంచి 13% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. తగ్గింపు తర్వాత దీని ధర రూ.39,998కి చేరుతుంది.
మీరు దీని ధరను మరింత తగ్గింపు ధరకు కొనాలనుకుంటే బ్యాంక్ ఆఫర్‌ను వాడుకోండి. అన్ని బ్యాంక్ కార్డులపై రూ 3,000 తగ్గింపు ఇస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేసుకుంటే గరిష్ఠంగా రూ.37,998 తగ్గింపు పొందవచ్చు. నెలకు రూ.1,939 EMI ఆప్షన్‌తో కూడా మీరు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
Realme GT 7 5G ఫీచర్లు
డిస్‌ప్లే: Realme 5G ఫోన్ 2780 × 1264 పిక్సెల్ రిజల్యూషన్‌తో వచ్చింది. ఇందులో 6.78-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 6000 నిట్స్.
పనితీరు: ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9400 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. గ్రాఫిక్స్ కోసం Arm Immortalis-G720 GPUతో ఇది వచ్చింది.
కెమెరా ఫీచర్లు: ఫొటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్‌సైడ్ 50-మెగాపిక్సెల్ IMX906 మెయిన్ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చింది. అంటే, అరగంటలో మీరు దీనిని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
ఇతర ఫీచర్లు: భద్రత కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.