Child Aadhaar : ఇలా చేయకుంటే.. మీ పిల్లల ఆధార్ కార్డు పనిచేయదు.. చెక్ చేశారా?

మీ పిల్లాడికి ఆధార్ కార్డు ఉందా? 5 ఏళ్లు నిండాయా? అయితే వెంటనే బయోమెటిక్స్ అప్ డేట్ చేయించండి. లేదంటే ఆధార్ పనిచేయకపోవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇచ్చే ఆధార్ కార్డులో బయోమెట్రిక్స్ ఉండవు. ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్స్ తీసుకోవడం తప్పనిసరి..

Child Aadhaar : ఇలా చేయకుంటే.. మీ పిల్లల ఆధార్ కార్డు పనిచేయదు.. చెక్ చేశారా?

Aadhaar Card Of Your Child

Updated On : July 30, 2021 / 9:58 AM IST

Aadhaar card your child : మీ పిల్లాడికి ఆధార్ కార్డు ఉందా? 5 ఏళ్లు నిండాయా? అయితే వెంటనే బయోమెటిక్స్ అప్ డేట్ చేయించండి. లేదంటే ఆధార్ పనిచేయకపోవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇచ్చే ఆధార్ కార్డులో బయోమెట్రిక్స్ ఉండవు. ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్స్ తీసుకోవడం తప్పనిసరి.. అలాగే 15ఏళ్ల వయస్సులో ఒకసారి బయోమెట్రిక్స్ అప్ డేట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ అప్ డేట్ ఉచితమే. దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

మీరు చేయాల్సిందిల్లా.. మీకు దగ్గరలోని #AadhaarEnrolment Centre వెళ్లండి. లేదా https://appointments.uidai.gov.in/easearch.aspx విజిట్ చేయొచ్చునని UIDAI ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిప్రకారం.. ఐదేళ్ల వయస్సులో పిల్లాడి బయోమెట్రిక్స్ అప్ డేట్ చేయించుకోవాలని UIDAI పేర్కొంది. ఆ తర్వాత 15ఏళ్ల వయస్సులో మరోసారి బయోమెట్రిక్స్ అప్ డేట్ చేసుకోవాలని తెలిపింది. ఆధార్ సెంటర్ ద్వారా పిల్లల తల్లిదండ్రులు అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బాల్ ఆధార్ కార్డును ఆన్ లైన్ ద్వారా బయోమెట్రిక్స్ రిక్వెస్ట్ పెట్టొచ్చు.

– UIDAI వెబ్ సైట్లోకి appointments.uidai.gov.in/easearch.aspx?AspxAutoDetectCookieSupport=1 ద్వారా లాగిన్ అవ్వండి.
– స్టేట్, పోస్టల్ (PIN) కోడ్ లేదా సెర్చ్ బాక్స్ ఆప్షన్ ద్వారా ఏదైనా ఒకటి ఎంచుకోండి.
– ఒక ఆప్షన్ ఎంచుకుని మీ వివరాలను ఎంటర్ చేయండి.
– Locate Center బటన్ పై క్లిక్ చేయండి.

అనంతరం తల్లిదండ్రులు మీకు దగ్గరలోని ఆధార్ సెంటర్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అపాయింట్ మెంట్ తీసుకుని బయోమెట్రిక్స్ అప్ డేట్ చేయించుకోవాలి.