Aadhaar Card Lock : మీ ఆధార్ కార్డు పోయిందా? మీ కార్డును వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!

Aadhaar card stolen or misplaced_ Here is how to lock your card to prevent fraud or misuse

Aadhaar Card Lock : ఆధార్ కార్డ్.. భారతీయ ప్రతి పౌరునికి ముఖ్యమైన డాక్యుమెంట్.. వివిధ ప్రయోజనాల కోసం ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్‌గా పనిచేస్తుంది. అయితే, మీ ఆధార్ కార్డు (Aadhaar Card Lock) దొంగిలించినా లేదా తప్పుగా వివరాలు ఉన్నా సరే.. తప్పుడు చేతుల్లోకి వెళ్లి మోసపూరిత కార్యకలాపాలకు దుర్వినియోగం కావచ్చు. ఇలాంటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ పాలక మండలి మీ ఆధార్ కార్డును లాక్ చేసే సదుపాయాన్ని అందించింది. ఒకసారి మీ ఆధార్ కార్డ్ లాక్ అయితే.. ఏ అథెంటికేషన్ ప్రయోజనాలకు పనిచేయదని గమనించాలి.

ఆధార్ (UID) లాక్ & అన్‌లాక్ అంటే ఏమిటి? :
ఆధార్ కార్డ్‌ను లాక్ చేయడం ద్వారా నివాసితులు స్కామర్‌లు దొంగిలించిన ఆధార్‌ను బయోమెట్రిక్స్, డెమోగ్రాఫిక్స్, OTP మోడాలిటీల కోసం UID, UID టోకెన్, VIDతో సహా ఏ విధమైన వెరిఫికేషన్ కోసం ఉపయోగించకుండా నిరోధించవచ్చు. ఆధార్ కార్డ్ గుర్తించినా లేదా నివాసితులు కొత్త ఆధార్ కార్డ్‌ని పొందినట్టుయితే.. UIDAI వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్ ద్వారా లేటెస్ట్ VIDని ఉపయోగించి వారి UIDని అన్‌లాక్ చేయవచ్చు. ఆధార్ (UID)ని అన్‌లాక్ చేసిన తర్వాత నివాసితులు UID, UID టోకెన్, VIDని ఉపయోగించి అథెంటికేషన్ కొనసాగించవచ్చు.

మీ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో ఎలా లాక్ చేయాలంటే? :
* UIDAI వెబ్‌సైట్‌కి (https://uidai.gov.in/) వెళ్లండి.
* ‘Myaadhaar‘ ట్యాబ్‌పై Click చేయండి.
* ‘Aadhaar Services‘ సెక్షన్ కింద, ‘Aadhaar Lock/Unlock‘పై Click చేయండి.
* ‘Lock UID‘ ఆప్షన్ ఎంచుకోండి.
* మీ ఆధార్ నంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్‌ని ఎంటర్ చేయండి.
* ‘Send OTP‘ బటన్‌పై Click చేయండి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి, Submit చేయండి.

Read Also : Aadhaar Update Status : మీ ఆధార్‌లో అప్‌డేట్ చేసిన వివరాల స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసా?

మీ ఆధార్ కార్డ్‌ను SMS ద్వారా ఎలా లాక్ చేయాలి? :
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 1947కి OTP రిక్వెస్ట్ SMS పంపండి.
* ఈ కింది మెసేజ్ GETOTP టైప్ చేయండి.
* ఉదాహరణకు.. మీ ఆధార్ నంబర్ 123456789012 అయితే, మీరు GETOTP 9012 అనే మెసేజ్ పంపవచ్చు.
* ఇప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 1947కు లాకింగ్ రిక్వెస్ట్ SMS పంపండి.
* ఈ కింది మెసేజ్ LOCKUIDOTP టైప్ చేయండి.
* మీ ఆధార్ నంబర్ 123456789012, OTP 123456, అయితే, మీరు LOCKUID 9012 123456 అనే మెసేజ్ పంపవచ్చు.
* మీ ఆధార్ కార్డ్ లాక్ చేసిన తర్వాత మీరు UIDAI నుంచి SMS నిర్ధారణను అందుకోవచ్చు.

Aadhaar card stolen or misplaced

మీ ఆధార్ కార్డ్‌ని ఎలా అన్‌లాక్ చేయాలి? :
మీ ఆధార్ కార్డ్‌ని కనుగొంటే.. పైన పేర్కొన్న పద్ధతులను ఉపయోగించి అన్‌లాక్ చేయవచ్చు. అయితే, మీ ఆధార్ కార్డ్‌ని అన్‌లాక్ చేయడానికి మీకు 16 అంకెల వర్చువల్ ID అవసరమని చెప్పవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అన్‌లాక్ చేయండి :
* UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లండి (https://uidai.gov.in/).
* ‘My Aadhaar‘ ట్యాబ్‌పై Click చేయండి.
* ‘Aadhaar Services’ సెక్షన్ కింద, ‘Aadhaar Lock/Unlock‘పై క్లిక్ చేయండి.
* ‘UID Unlock‘ ఆప్షన్ ఎంచుకోండి.
* మీ 16 అంకెల వర్చువల్ IDని ఎంటర్ చేయండి.
* ‘Send OTP‘ బటన్‌పై Click చేయండి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి, Submit చేయండి.

SMS ద్వారా ఆధార్‌ను Unlock చేయండి : 
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 1947కి OTP రిక్వెస్ట్ SMS పంపండి.
* ఈ కింది మెసేజ్ GETOTP టైప్ చేయండి.
* ఉదాహరణకు.. మీ వర్చువల్ ID 1234 5678 9012 8888 అయితే, మీరు GETOTP 128888 అనే మెసేజ్ పంపుతారు.
* ఇప్పుడు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 1947కు అన్‌లాక్ రిక్వెస్ట్ SMS పంపండి.
* ఈ కింది మెసేజ్ UNLOCKUIDOTP టైప్ చేయండి.
* ఉదాహరణకు.. మీ వర్చువల్ ID 1234 5678 9012 8888 అయితే, OTP 123456 అయితే, మీరు UNLOCKUID 128888 123456 అనే మెసేజ్ పంపుతారు.
* మీ ఆధార్ కార్డ్ Unlock అయిన తర్వాత UIDAI నుంచి SMS నిర్ధారణను అందుకుంటారు.

Read Also : Aadhaar Card Alert : మీ ఆధార్‌లో ఈ సెక్యూరిటీ సెట్టింగ్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త..!

ట్రెండింగ్ వార్తలు