Airbag phone case
Airbag phone case : ఫోను కొన్నప్పుడు అది పొరపాటున కింద పడినా పగలకుండా ఉండేందుకు ఫోన్ కేస్.. టెంపర్డ్ గ్లాస్ కొంటాం. అయినా కూడా ఒక్కోసారి ఫోన్ పగిలిన సందర్భాలు ఉంటాయి. అయితే ఎయిర్ బ్యాగ్‌తో వచ్చిన ఫోన్ కేస్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది చూసిన వారంతా కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఫోన్ కేస్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.
@Vector హ్యాండిల్ Instagramలో షేర్ చేసిన వీడియో అందరిలో ఆసక్తి రేపుతోంది. ఎయిర్ బ్యాగ్‌తో ఉన్న ఫోన్ కేస్ ఆకర్షించింది. దీనిని కొనడానికి జనం ఆసక్తి చూపుతున్నారు. క్లిప్‌లో యువకుడు ఫోన్‌ను ఫోన్ కేస్‌లో పెట్టి కింద పడేస్తాడు. ఫోన్ కింద పడుతున్నప్పుడు ఎయిర్ బ్యాగ్ కవర్ ఓపెన్ అయ్యి ఫోన్‌కు రక్షణగా నిలిచింది. ఈ వీడియో చూసిన జనం ఆశ్చర్యపోయారు. ఆగస్టు 21న షేర్ చేసిన ఈ వీడియోను 55 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు.
‘నాకు ASAP కావాలని కొందరు.. ఇది ఎక్కడ దొరుకుతుంది?’ అని కొందరు కామెంట్లు చేసారు. ఇంకా కొందరు వీడియో చూసాకా ఆర్డర్ చేసామని చెప్పారు. కార్లలోనే కాదు ఇకపై ఫోన్ కు కూడా ఎయిర్ బ్యాగ్ రక్షణ కవచంలా ఉండబోతోందన్నమాట. ఈ వీడియో చూసాక ఈ ఫోన్ కేస్ కి ఫుల్ డిమాండ్ పెరిగినా ఆశ్చర్యం లేదు.