Motorola Edge 40 Neo Launch : మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 21నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Motorola Edge 40 Neo Launch : మోటోరోలా నుంచి కొత్త మోటో ఎడ్జ్ 40 నియో ఫోన్ వచ్చేస్తోంది. సెప్టెంబర్ 21న భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 40 లాంచ్ కానుంది. ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Motorola Edge 40 Neo Launch : మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 21నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Motorola Edge 40 Neo India Launch Date Set For September 21

Motorola Edge 40 Neo Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40 Neo) నియో త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది. గత ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టిన రెండు ఇతర మోడళ్లతో ఈ కొత్త హ్యాండ్‌సెట్ చేరనుంది. మోటరోలా ఎడ్జ్ 40 బేస్ మోడల్ గత మేలో లాంచ్ అయింది. అయితే, మోటరోలా ఎడ్జ్ 40 ప్రో దేశంలో ఇప్పటికీ లాంచ్ కాలేదు. ఇటీవల లీక్ ఎడ్జ్ 40 నియో ముఖ్య ఫీచర్లు, డిజైన్, కలర్ ఆప్షన్లను సూచించింది. ఇప్పుడు (Lenovo) యాజమాన్యంలోని సంస్థ మోటోరోలా ఎడ్జ్ 40 నియో భారతీయ లాంచ్ తేదీని ప్రకటించింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ (X)లో పోస్ట్‌లో Motorola India (@motorolaindia) మోటోరోలా ఎడ్జ్ 40 నియో డిజైన్‌ను రివీల్ చేసింది. ఈ ఫోన్ సెప్టెంబర్ 21న భారత మార్కెట్లో లాంచ్ కానుందనిధృవీకరించింది. రాబోయే హ్యాండ్‌సెట్ సిల్హౌట్ ఫొటో బ్యాక్ ప్యానెల్‌లోని టాప్ లెఫ్ట్ కార్నర్‌లో దీర్ఘచతురస్రాకార కెమెరా ఐలాండ్‌లో డబుల్ కెమెరా యూనిట్, LED ఫ్లాష్ యూనిట్‌తో బ్లూ కలర్ ఆప్షన్ పొందవచ్చు.

Read Also : Honor 90 5G : 200MP కెమెరా, భారీ డిస్‌ప్లేతో హానర్ 90 5G ఫోన్ ఇదిగో.. భారత్‌లో ధర ఎంత? ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

మోటోరోలా ఎడ్జ్ 40 నియో డిజైన్ రెండర్, కలర్ ఆప్షన్‌లు, కీలక స్పెసిఫికేషన్‌లపై గత నివేదిక సూచించింది. ఈ ఫోన్ రైట్ ఎడ్జ్ వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌తో ఫ్లాట్ ఎడ్జ్ ఇరుకైన బెజెల్స్‌తో హ్యాండ్‌సెట్ కనిపించింది. బాటమ్ ఎడ్జ్ USB టైప్-C పోర్ట్, మైక్రోఫోన్, SIM ట్రే స్లాట్, స్పీకర్ గ్రిల్‌తో కనిపించింది. కెనీల్ బే, బ్లాక్ బ్యూటీ, కన్సోల్ సీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Motorola Edge 40 Neo India Launch Date Set For September 21

Motorola Edge 40 Neo India Launch Date Set For September 21

MySmartPrice నివేదిక ప్రకారం.. 6.55-అంగుళాల ఫుల్-HD+ (2400×1080 పిక్సెల్‌లు) పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మోటోరోలా ఎడ్జ్ 40 నియో 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు. Mali G77 GPU, 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో MediaTek డైమెన్సిటీ 1050 SoC ద్వారా అందిస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత (MyUX OS)తో వచ్చే అవకాశం ఉంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఎడ్జ్ 40 నియో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ రియర్ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రంట్ కెమెరా 32MP సెన్సార్‌తో అమర్చబడి ఉంటుందని భావిస్తున్నారు. డిస్‌ప్లే పైభాగంలో హోల్-పంచ్ కటౌట్‌లో ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ 40 నియో 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని అందిస్తుంది.

సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ IP68 రేటింగ్‌తో వస్తుందని కూడా అంచనా. డ్యుయల్ నానో సిమ్-సపోర్ట్ చేసే ఫోన్ 5G, బ్లూటూత్, NFC, Wi-Fi, USB టైప్-C కనెక్టివిటీకి సపోర్టు ఇవ్వనుంది.

Read Also : iPhone 14 Series Price Cut : ఐఫోన్ 15 సిరీస్ రాగానే.. భారీగా తగ్గిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ధరలు.. ఏ ఫోన్ ధర ఎంతంటే?