T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఎయిర్‌టెల్ స్పెషల్ ఆఫర్లు.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ కూడా!

T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ సమయంలో వినియోగదారులు కొత్తగా ప్రవేశపెట్టిన రీఛార్జ్ ప్లాన్‌లో 3 నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను ఫ్రీగా అందిస్తోంది.

Airtel T20 World Cup 2024 ( Image Credit : Google )

T20 World Cup 2024 : ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్‌టెల్ (Airtel) ఈ ఏడాదిలో క్రికెట్ సీజన్ కోసం ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్ సమయంలో వినియోగదారులు కొత్తగా ప్రవేశపెట్టిన రీఛార్జ్ ప్లాన్‌లో 3 నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను ఫ్రీగా అందిస్తోంది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్రత్యేక ప్లాన్‌లు 28 రోజులకు రూ.499తో ప్రారంభమవుతాయి.

Read Also : OnePlus Nord 3 Discount : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఈ ఫోన్ కొనాలా? కొత్త నార్డ్ 4 ఫోన్ కోసం ఆగాలా?

ఈ క్రికెట్ సీజన్ ప్రారంభంతో టీ20 ప్రపంచ కప్ 2024ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఎయిర్‌టెల్ ముందుకు అడుగులు వేస్తుంది. కంపెనీ తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, ఇంటర్నేషనల్ రోమింగ్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ యూజర్లకు భారత మార్కెట్లో ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 క్రికెట్ టోర్నమెంట్ అధికారిక స్ట్రీమింగ్ పార్టనర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు 3 నెలల సభ్యత్వాన్ని అందిస్తుంది.

ఎయిర్‌టెల్ టీ20 ప్రపంచ కప్ 2024 ప్లాన్ :
టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు 3 నెలల సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 28 రోజుల హై-స్పీడ్ 3జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ రూ. 499 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లేలో 20 ఓటీటీలను ఫ్రీగా అందిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో సమానమైన బెనిఫిట్స్ అందించే ఆఫర్‌లో రూ.839 ప్లాన్ కింద 84 రోజుల వ్యాలిడిటీని కూడా అందిస్తుంది. రూ. 3,359 వార్షిక ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి ఒక ఏడాది సబ్‌స్క్రిప్షన్, ఎక్స్‌ట్రీమ్ యాప్‌లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్, రోజుకు 2.5జీబీ డేటా పొందవచ్చు.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ 5జీ డేటా, ఫ్యామిలీ యాడ్-ఆన్ బెనిఫిట్స్‌, ఎక్స్‌ట్రీమ్ యాప్‌లో 20కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌తో ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రూ. 499తో ప్రారంభమవుతాయి. అన్ని ఫీచర్‌లతో కలిపి 75జీబీ అందిస్తుంది.

అంతకంటే ఎక్కువ ధర కలిగిన ప్లాన్‌లు మెరుగైన బెనిఫిట్స్ అందిస్తాయి. ఉదాహరణకు.. రూ. 599 వద్ద వినియోగదారులు 30జీబీ యాడ్-ఆన్‌లు, ఒక ఏడాది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో 75జీబీ పొందవచ్చు. అదేవిధంగా, రూ. 999 వద్ద యూజర్లు 3 యాడ్-ఆన్‌లతో 100జీబీ ఇంటర్నెట్ యాక్సెస్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అన్‌లిమిటెడ్ ఎక్స్‌ట్రీమ్ ప్లేని పొందవచ్చు.

రూ. 999, రూ. 1,498, రూ. 3,999 ప్లాన్లలో హై-స్పీడ్ ఇంటర్నెట్, ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొఫెషనల్, ఇన్ఫినిటీ ప్లాన్‌లపై హోమ్ కస్టమర్‌లకు వైడ్ రేంజ్ స్పీడ్ ఆప్షన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లైవ్ మ్యాచ్‌లను వీక్షించడానికి అమెరికా, కెనడాకు వెళ్లే అభిమానుల కోసం, కంపెనీ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీతో అందిస్తోంది. తద్వారా క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్‌లను లైవ్ వీక్షించేందుకు అంతర్జాతీయ రోమింగ్‌ను రోజుకు రూ. 133 చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Realme Narzo N63 : 50ఎంపీ రియర్ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి నార్జో N63 ఫోన్.. ధర ఎంతంటే?