OnePlus Nord 3 Discount : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఈ ఫోన్ కొనాలా? కొత్త నార్డ్ 4 ఫోన్ కోసం ఆగాలా?

OnePlus Nord 3 Discount : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ఇప్పటికే జూలైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీరు నెక్స్ట్ జనరేషన్ మోడల్ కోసం వేచి ఉండాలా లేదా వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ కొనుగోలు చేయాలా? లేదా ఇప్పుడు తెలుసుకుందాం.

OnePlus Nord 3 Discount : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఈ ఫోన్ కొనాలా? కొత్త నార్డ్ 4 ఫోన్ కోసం ఆగాలా?

OnePlus Nord 3 gets Rs 13k discount ( Image Credit : Google )

Updated On : June 5, 2024 / 6:15 PM IST

OnePlus Nord 3 Discount : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ అతి తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు ఈ వన్‌ప్లస్ ఫోన్ రూ. 20,999కి పొందవచ్చు. ఎందుకంటే.. ఈ ఫోన్ రూ. 33,999 వద్ద లాంచ్ అయింది. అంటే.. రూ. 13వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. రాబోయే కొత్త వెర్షన్ వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ వచ్చే జూలైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీరు నెక్స్ట్ జనరేషన్ మోడల్ కోసం వేచి ఉండాలా లేదా వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ కొనుగోలు చేయాలా? లేదా ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Vivo Watch GT Launch : 21 రోజుల బ్యాటరీ లైఫ్, ఇసిమ్ సపోర్ట్‌తో వివో జీటీ స్మార్ట్‌వాచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే

అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 భారీ డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ రూ. 20,999 ప్రారంభ ధరతో జాబితా అయింది. గత ఏడాది జూలైలో మిడ్-రేంజ్ 5జీ ఫోన్ రూ. 33,999 ధరతో లాంచ్ కాగా, ఈ ఫోన్‌పై రూ. 13వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్‌లో అదనంగా రూ. 1,000 తగ్గింపు కూపన్ కూడా పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధర రూ.19,999కి తగ్గనుంది. ప్రస్తుతానికి, ఈ ఆఫర్ గడువు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.

వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ కొనుగోలు చేయాలా? :
వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ రూ. 20వేల లోపు ధరకే కొనుగోలు చేయొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9000ఎస్ఓసీ కలిగి ఈ ఫోన్ రూ. 20వేల లోపు ఫోన్లలో కన్నా వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ డీసెంట్, డిస్‌ప్లే చాలా బాగుంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో సాధారణ 5,000ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంది. కొత్త వెర్షన్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాబోయే వన్‌ప్లస్ నార్డ్ 4 మోడల్ గత వెర్షన్ల కన్నా బెస్ట్ అప్‌గ్రేడ్‌లతో ఉండవచ్చు.

ఈ వన్‌ప్లస్ ఫోన్ ధర కూడా రూ. 35వేల లోపు ఉంటుంది. కొత్త క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జనరేషన్ 3 ఎస్ఓసీ,2ఎంపీ మాక్రో సెన్సార్‌కు బదులుగా 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ రియర్ కెమెరా, పెద్ద 5,500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ స్పెసిఫికేషన్‌లు పాత వెర్షన్‌లోనే ఉంటాయని రుమర్లు వినిపిస్తున్నాయి.  అయితే, లీక్‌లు చాలా వరకు నిజమని తేలింది. కంపెనీ నార్డ్ 4 ఫీచర్లను అధికారికంగా ధృవీకరించలేదు. పాత వెర్షన్‌ను కొనుగోలు వద్దనుకుంటే వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ కోసం వేచి ఉండవచ్చు.

భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ధర (అంచనా) :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ రూ. 33,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ధర ఇంకా లీక్ కాలేదు. కానీ, వన్‌ప్లస్ మిడ్-రేంజ్ ప్రీమియం వన్‌ప్లస్ 12ఆర్ రూ. 39,999కి విక్రయిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 35వేల కన్నా ఎక్కువ ఉండదు. వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ప్రారంభ ధర రూ. 30వేల నుంచి రూ. 35వేల మధ్య ఉండవచ్చని అంచనా. కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 (Nord CE4) స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ. 30వేలు ఉండగా.. బేస్ మోడల్ ధర రూ. 24,999 (128జీబీ)గా నిర్ణయించింది. 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999కు పొందవచ్చు.

Read Also : Vivo S19 Pro Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వివో S19 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?