Vivo Watch GT Launch : 21 రోజుల బ్యాటరీ లైఫ్, ఇసిమ్ సపోర్ట్‌తో వివో జీటీ స్మార్ట్‌వాచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే

Vivo Watch GT Launch : వివో వాచ్ జీటీ వాచ్ గరిష్టంగా 21 రోజుల బ్యాటరీ లైఫ్, ఇ-సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. వివో చైనా ఇ-స్టోర్ ద్వారా బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. జూన్ 14 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.

Vivo Watch GT Launch : 21 రోజుల బ్యాటరీ లైఫ్, ఇసిమ్ సపోర్ట్‌తో వివో జీటీ స్మార్ట్‌వాచ్.. ధర, స్పెసిఫికేషన్‌లు ఇవే

Vivo Watch GT With Up to 21 Days Battery Life ( Image Credit : Google )

Vivo Watch GT Launch : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. అదే.. వివో వాచ్ జీటీ మోడల్.. చైనాలో వివో S19 సిరీస్‌తో పాటు మే 30న లాంచ్ అయింది. అయితే, ఈ స్మార్ట్‌వాచ్ బ్లూఓఎస్ (BlueOS) అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.

100 కన్నా ఎక్కువ ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. 2.5డీ బోర్డర్‌లెస్ కర్వ్డ్ డిస్‌ప్లే, ఫంక్షనల్, రొటేటింగ్ క్రౌన్ కలిగి ఉంది. ఈ వాచ్ గరిష్టంగా 21 రోజుల బ్యాటరీ లైఫ్, ఇ-సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. అంతేకాదు.. హెల్తీ ఫీచర్లలో హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ల వంటి అనేక హెల్త్, వెల్నెస్ ట్రాకర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వేరబుల్ వివో హెల్త్ యాప్‌కు సపోర్టు చేస్తుంది.

Read Also : Hero Splendor Launch : హీరో స్ప్లెండర్ కొత్త బైక్ మోడల్ వచ్చేసిందోచ్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ..!

వివో వాచ్ జీటీ ధర ఎంతంటే? :
వివో వాచ్ జీటీ చైనాలో ఇసిమ్+ సిలికాన్ స్ట్రాప్ ఆప్షన్ కోసం సీఎన్‌వై 799 (దాదాపు రూ. 9,200)గా ఉంది. అయితే, ఇసిమ్+ ఫాక్స్ లెదర్ స్ట్రాప్ వేరియంట్ సీఎన్‌వై 899 (సుమారు రూ. 10,400) వద్ద జాబితా అయింది. సిలికాన్ బెల్ట్ సమ్మర్ నైట్ బ్లాక్ షేడ్‌లో కనిపిస్తుంది. వేగన్ లెదర్ బెల్ట్ తెల్లటి రంగులో కనిపిస్తుంది. క్లియర్ స్కై, వైట్ క్లౌడ్స్‌గా విక్రయిస్తోంది. ఈ వాచ్ ఇప్పుడు వివో చైనా ఇ-స్టోర్ ద్వారా రిజర్వేషన్‌ల కోసం అందుబాటులో ఉంది. జూన్ 14 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.

వివో వాచ్ జీటీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో వాచ్ జీటీ 390 x 450 పిక్సెల్స్ రిజల్యూషన్, ఆల్వేస్-ఆన్-డిస్ప్లే (AOD) సపోర్ట్‌తో 1.85-అంగుళాల 2.5D కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఏఐ షార్ట్‌హ్యాండ్ వంటి అనేక ఏఐ-ఆధారిత ఫీచర్‌లతో వివో బ్లూఓఎస్‌తో వస్తుంది. ఈ ఫీచర్ యూజర్లు వాచ్ నుంచి వాయిస్ ఫైల్‌లను నేరుగా రికార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది. సంబంధిత ఫైల్‌లను ఆటమ్ నోట్ యాప్‌లో సింక్రొనైజ్ చేస్తుంది. ఆపై సేవ్ చేస్తుంది. ఇతర ఫంక్షన్లతో పాటు ఏఐ వాచ్ ఫేస్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వినియోగదారుల వాయిస్ ప్రాంప్ట్‌ల ద్వారా వాచ్ ఫేస్‌లను రూపొందించగలదు.

కొత్తగా లాంచ్ చేసిన వివో స్మార్ట్‌వాచ్‌లో ఆప్టికల్ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సెన్సార్‌లు ఉన్నాయి. వివో వాచ్ జీటీలో ఒత్తిడి స్థాయిలతో పాటు అలాగే నిద్ర, ఋతు చక్రాలను ట్రాక్ చేయడంలో సాయపడుతుంది. ఈ ట్రాకర్‌ల నుంచి డేటా సింకరైజ్ అవుతుంది. వివో హెల్త్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అదనపు సెన్సార్లలో యాక్సిలరేషన్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్, యాంబియంట్ లైట్ ఉన్నాయి.

వివో మాగ్నెటిక్ పిన్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వివో వాచ్ జీటీలో 505ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, బ్యాటరీ సేవింగ్ మోడ్‌తో పాటు ఇసిమ్ వినియోగంతో, వాచ్ గరిష్టంగా తొమ్మిది రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. సాధారణ వినియోగంతో మూడు రోజుల వరకు తగ్గుతుంది. ఈ గడియారం కేవలం బ్లూటూత్ ఫంక్షన్‌లతో 21 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. బ్యాటరీ ఆదా మోడ్‌లో ఇసిమ్ వినియోగాన్ని కలిగి ఉండదు. సాధారణ వినియోగంతో ఛార్జింగ్ 10 రోజుల వరకు ఉంటుంది.

వివో వాచ్ జీటీ చెల్లింపులకు ఇసిమ్, అలాగే బ్లూటూత్ 5.3, జీపీఎస్, GLONASS, GALILEO, Beidou, NFC ద్వారా ఎల్టీఈ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. వాచ్‌లో స్పీకర్‌ని కూడా అమర్చారు. మైక్రోఫోన్‌లో తిరిగే, ఫంక్షనల్ క్రౌన్ ఉంటుంది. ఈ వాచ్ బరువు 33 గ్రాములు, పరిమాణం 45.8 x 39.6 x 11.2ఎమ్ఎమ్ ఉంటుంది.

Read Also : Credit Card New Rules : క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఈ 4 బ్యాంకుల క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్‌.. తప్పక తెలుసుకోండి!