Realme Narzo N63 : 50ఎంపీ రియర్ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి నార్జో N63 ఫోన్.. ధర ఎంతంటే?

Realme Narzo N63 : 50ఎంపీ రియర్ కెమెరా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి నార్జో N63 ఫోన్.. ధర ఎంతంటే?

Realme Narzo N63 With 50-Megapixel Rear Camera ( Image Credit : Google )

Updated On : June 5, 2024 / 6:09 PM IST

Realme Narzo N63 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో జూన్ 5న రియల్‌మి నార్జో N63 ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ చిప్‌సెట్, ఏఐ సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 45డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో ఈ నెలాఖరులో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ సెగ్మెంట్ ఏకైక ‘ప్రీమియం వేగన్ లెదర్’ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ మే 2023లో ప్రవేశపెట్టిన రియల్‌‌మి నార్జో ఎన్53కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది.

Read Also : Vivo S19 Pro Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వివో S19 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

రియల్‌మి నార్జో ఎన్63 ఫోన్ ధర ఎంతంటే? :
రియల్‌మి నార్జో ఎన్63 4జీబీ+ 64జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 8,499, 4జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 8,999కు పొందవచ్చు. ఈ ఫోన్ అమెజాన్, రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ జూన్ 10న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

మొదటి సేల్ జూన్ 14 వరకు కొనసాగుతుంది. రియల్‌‌‌మి అధికారిక సైట్‌లో రియల్‌మి నార్జో ఎన్63 ధర రూ.7,999కి కి తగ్గుతుంది. 64జీబీ, 128జీబీ ఆప్షన్లు వరుసగా రూ. 8,499కు పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ లెదర్ బ్లూ, ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది.

రియల్‌మి నార్జో ఎన్63 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రియల్‌మి నార్జో ఎన్63 ఫోన్ 6.74-అంగుళాల హెచ్‌డీ+ (1,600 x 720 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 180 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 450 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. మాలి-జీ57 జీపీయూ, 4జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో యూనిసోక్ టీ612 ఎస్ఓసీ ద్వారా ఫోన్ పవర్ అందిస్తుంది. కెమెరా విభాగంలో రియల్‌మి నార్జో ఎన్63 50ఎంపీ ఏఐ సపోర్టుతో ప్రైమరీ బ్యాక్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 8ఎంపీ సెన్సార్‌తో వస్తుంది.

ఈ రియల్‌మి ఫోన్ ఎయిర్ గెస్చర్, డైనమిక్ బటన్, మినీ క్యాప్సూల్ 2.0 సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. నార్జో ఎన్63 ఫోన్ 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ ఫోన్ 4జీ VoLTE, వై-ఫై, బ్లూటూత్ 5,0, జీపీఎస్, GLONASS యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌ను కలిగి ఉంది.

Read Also : OnePlus Nord 3 Discount : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఈ ఫోన్ కొనాలా? కొత్త నార్డ్ 4 ఫోన్ కోసం ఆగాలా?