Airtel OTT Plans
Airtel OTT Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ దేశీయ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం OTT బెనిఫిట్స్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఎంచుకున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే వారికి కంపెనీ ఫ్రీగా OTT సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది.
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. మీరు ఓటీటీ సబ్‌స్ర్కిప్షన్ కోసం ఖరీదైన రీఛార్జ్ చేయనవసరం లేదు. మీరు రూ. 200 కన్నా తక్కువ ధరకే డీల్‌ను పొందవచ్చు. రూ. 200 కన్నా తక్కువ ధర ఉన్న పాపులర్ ఓటీటీ సర్వీసులను అందించే ప్లాన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకుని ఓటీటీ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయండి.
ఎయిర్‌టెల్ రూ.100 ప్లాన్ :
కంపెనీ అత్యంత చౌకైన OTT రీఛార్జ్ ప్లాన్ రూ.100కు ఆఫర్ చేస్తోంది. ఇది డేటా ఓన్లీ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేస్తే.. వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీతో పాటు 5GB అదనపు డేటా అందిస్తోంది. అంతేకాదు.. జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా 30 రోజుల పాటు అందుబాటులో ఉంది.
ఎయిర్‌టెల్ రూ.195 ప్లాన్ :
మీరు (JioHotstar) మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను 3 నెలలు పూర్తిగా పొందాలనుకుంటే.. ఈ ప్లాన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. రూ. 195 ప్లాన్ కూడా డేటా-ఓన్లీ ప్లాన్, 90 రోజుల వ్యాలిడిటీతో 15GB అదనపు డేటాను అందిస్తుంది. డేటా-ఓన్లీ ప్లాన్‌లు అదనపు డేటాను మాత్రమే అందిస్తాయి. కాలింగ్, SMS బెనిఫిట్స్ లేవని గమనించాలి.
ఎయిర్‌టెల్ రూ.181 ప్లాన్ :
ఎయిర్‌టెల్ యూజర్లు 181 ప్లాన్‌లతో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ డేటా-ఓన్లీ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB అదనపు డేటాతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఒక నెల పాటు అందిస్తుంది.
ఎయిర్‌టెల్ యూజర్లు 22 కన్నా ఎక్కువ OTT సర్వీసుల నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. జియోహాట్‌స్టార్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టోర్నమెంట్ లైవ్ స్ట్రీమింగ్ అందిస్తోంది. ఐపీఎల్ వీక్షించేందుకు చాలా మంది వినియోగదారులు ఫ్రీ జియోహాట్‌స్టార్ ప్లాన్‌లను ఇష్టపడుతున్నారు.