Alien Signal : భూమికి ఏలియన్ సిగ్నల్.. గ్రహంతరవాసులు ఉండేది ఇక్కడేనట.. స్థావరాన్ని కనిపెట్టిన ఖగోళ శాస్త్రవేత్తలు!

Alien Signal : అంతరిక్ష శూన్యంలో ప్రతిధ్వనించే ఆ గ్రహాంతర సంకేతం మన భూమిని తాకిందని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆ సిగ్నల్ ఎక్కడి నుంచో వచ్చిందో కూడా కనిపెట్టేశారు.

Alien Signal : భూమికి ఏలియన్ సిగ్నల్.. గ్రహంతరవాసులు ఉండేది ఇక్కడేనట.. స్థావరాన్ని కనిపెట్టిన ఖగోళ శాస్త్రవేత్తలు!

Alien signal hits Earth

Updated On : January 24, 2025 / 6:26 PM IST

Alien Signal : ఏలియన్స్ నిజంగా ఉన్నారా? గ్రహంతరవాసులు అనగానే అదేదో హాలీవుడ్ మూవీల్లో కనిపించినట్టుగా ఉంటారా? కచ్చితంగా చెప్పలేం. వాస్తవానికి ఇప్పటికీ కూడా ఏలియన్స్ ఉన్నాయనే కచ్చితమైన ఆధారాలేమి లేవనే చెప్పాలి. ఏలియన్స్ కు సంబంధించి అనేక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు కూడా దొరకడం లేదు. విశ్వంలో మనకు కనిపించని ఎన్నో వింతలు ఉంటాయనేది నమ్మితీరాల్సిందే. అలాంటి వింత లోకంలో ఏలియన్స్ వంటివి ఏదో ఆకారాలు కనిపించినట్టుగా గతంలోనూ అనేక వార్తలు వచ్చాయి. వాటి ఆకారం అచ్చం ఏలియన్స్ మాదిరిగానే ఉన్నాయని అంచనాలు మొదలయ్యాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా క్లారిటీ లేదు.

Read Also : Relief for EPF members : ఈపీఎఫ్ సభ్యులకు రిలీఫ్.. ఇకపై డాక్యుమెంట్లతో పనిలేదు.. ఈ కొత్త రూల్‌తో ప్రొఫైల్ అప్‌డేట్ చాలా ఈజీ..!

ఆ సిగ్నల్ ఇక్కడిదేనట :
ఒకవేళ నిజంగా గ్రహంతరవాసులు ఉండిఉంటే వాళ్లు మనతో కమ్యూనికేట్ అయ్యేందుకు తప్పక ప్రయత్నిస్తుంటారని విశ్వసిస్తుంటారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఈ నమ్మకంతోనే సైంటిస్టులు అన్వేషిస్తుంటారు. తాజాగా అంతరిక్ష శూన్యం నుంచి మన భూమికి ఏలియన్స్ నుంచి సిగ్నల్ వచ్చిందంటూ వార్త హల్‌చల్ చేస్తోంది. అంతరిక్ష శూన్యంలో ప్రతిధ్వనించే ఆ గ్రహాంతర సంకేతం మన భూమిని తాకిందని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆ సిగ్నల్ ఎక్కడి నుంచో వచ్చిందో కూడా కనిపెట్టేశారు. అది ఒక పురాతన మృత గెలాక్సీ నుంచి వస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఫాస్ట్ రేడియో బర్స్ట్స్ (FRBs) మూలంగా చెబుతున్నారు. అయితే, FRB అనే మృత గెలాక్సీ వెలుపలి నుంచి ఈ సిగ్నల్ వస్తున్నట్లుగా తేల్చేశారు. అయితే, ఈవెంట్‌కు (FRB 20240209A) అని పేరు పెట్టారు.

ఎఫ్ఆర్‌‌బీని గుర్తించిన శాస్త్రవేత్తలు :
సాధారణంగా విశ్వంలో అత్యంత శక్తివంతమైన రహస్యమైన సంకేతాలు ఎన్నో వస్తుంటాయి. ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా దీర్ఘవృత్తాకార గెలాక్సీకి సంబంధించిన ఫాస్ట్ రేడియో బర్స్ట్ (ఎఫ్‌ఆర్‌బి)ని గుర్తించారు. 11.3 బిలియన్ సంవత్సరాల పురాతన గెలాక్సీ శివార్లలో నుంచి ఉద్భవించిన ఫాస్ట్ రేడియో బర్స్ట్ (FRB)ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉనికిలో లేని ఈ మృత గెలాక్సీ కొత్త నక్షత్రాలను ఏర్పరచదు. గతంలో (FRB)లు మాగ్నెటార్ల నుంచి ఉద్భవించాయని శాస్త్రవేత్తలు విశ్వసించారు. భారీ నక్షత్రాల అవశేషాల కోర్లతో ఆవిష్కరించడాన్ని చూసి ఖగోళ శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Alien signal hits Earth

Alien signal hits Earth

ఫాస్ట్ రేడియో బర్స్ట్‌లు (FRB) లోతైన అంతరిక్షం నుంచి ఉద్భవించే రేడియో తరంగాల శక్తివంతమైన పేలుళ్లు. సాధారణంగా కొన్ని మిల్లీసెకన్లు మాత్రమే ఉంటాయి. కానీ, సూర్యుడు ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసేంత శక్తిని విడుదల చేయగలవు. వీటికి అపారమైన శక్తి ఉన్నప్పటికీ, ఎఫ్ఆర్‌బీల స్వభావం, భూమిని చేరుకునేందుకు ప్రయాణించే విస్తారమైన దూరాల కారణంగా వాటి గమనాన్ని అధ్యయనం చేయడం సవాలుగా ఉన్నాయి. ఎఫ్ఆర్‌బీలు విశ్వాన్ని అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అందిస్తాయి. రేడియో తరంగాలు నక్షత్రమండలాల మద్యవున్న అంతరిక్షం గుండా ప్రయాణిస్తాయి. ఎఫ్ఆర్‌బీలను విశ్లేషించడం వల్ల కాస్మిక్ పదార్థం, అయస్కాంత క్షేత్రాలు, విశ్వం ప్రారంభ దశల సాంద్రత, కూర్పు గురించి సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చు.

నక్షత్రాలు ఏర్పడని చోట ఎలా సాధ్యం :
ఇది మృత గెలాక్సీ వెలుపల కనుగొనిన మొదటి ఎఫ్ఆర్‌బీ మాత్రమే కాదు. అన్ని ఇతర ఎఫ్ఆర్‌బీలతో పోలిస్తే.. ఇది సంబంధిత గెలాక్సీకి చాలా దూరంలో ఉంది. ఎఫ్ఆర్‌బీ స్థానం ఆశ్చర్యకరంగా ఉంది. కొత్త నక్షత్రాలు ఏర్పడని ప్రాంతాలలో ఇలాంటి శక్తివంతమైన సంఘటనలు ఎలా జరుగుతాయి అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది” అని అధ్యయనం ప్రధాన రచయిత విశ్వంగి షా అన్నారు. గెలాక్సీ వెలుపల పాత, చనిపోయిన నక్షత్రాల దట్టమైన ప్రాంతం. ఇది ధృవీకరించితే (FRB 20240209A)ని గ్లోబులర్ క్లస్టర్‌తో అనుసంధానించిన రెండో ఎఫ్ ఆర్‌బీ మాత్రమే చేస్తుంది”అని షా చెప్పారు.

ఆ మృత గెలాక్సీ భూమి నుంచి రెండు బిలియన్ సంవత్సరాల దూరంలో ఉంది. సూర్యుని ద్రవ్యరాశి కంటే 100 బిలియన్ రెట్లు చాలా భారీ, ప్రకాశవంతమైన నక్షత్రాలతో నిండి ఉంది. ఎఫ్‌ఆర్‌బీ గెలాక్సీ అంచుల నుండి ఉద్భవించినందున కూడా అసాధారణమైనది. అయితే చాలా ఎఫ్ ఆర్‌‌బీలు గెలాక్సీ కోర్ల వైపు ఉన్నాయి. ఎఫ్ఆర్‌బీలను వివరించడానికి శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. దట్టమైన గ్లోబులర్ క్లస్టర్, దాదాపు గోళాకార, స్థిరమైన నక్షత్రాల అనుబంధాల నుంచి ఉద్భవించి ఉండవచ్చు. ఈ సంఘటన రెండు న్యూట్రాన్ నక్షత్రాల మధ్య విలీనం సొంత బరువుతో కూలిపోవడం ద్వారా ప్రేరేపించవచ్చునని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఖగోళ శాస్త్రవేత్తలకు ఎఫ్‌ఆర్‌బి మూలం వద్ద గ్లోబులర్ క్లస్టర్ ఉందో లేదో కచ్చితంగా తెలియదు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో తదుపరి పరిశీలనల ద్వారా నిర్ధారించవచ్చు.

Read Also : BSNL Plan : ఇదెక్కడి బాధరా బాబూ.. సెకండ్ సిమ్‌కి నెలనెలా రీచార్జ్ చేయాల్సి వస్తుందనుకుంటున్నారా?.. బీఎస్ఎన్ఎల్ ఖతర్నాక్ రీచార్జ్ ప్లాన్