BSNL Plan : ఇదెక్కడి బాధరా బాబూ.. సెకండ్ సిమ్‌కి నెలనెలా రీచార్జ్ చేయాల్సి వస్తుందనుకుంటున్నారా?.. బీఎస్ఎన్ఎల్ ఖతర్నాక్ రీచార్జ్ ప్లాన్

BSNL Recharge Plan : ఇతర టెలికం దిగ్గాలతో పోలిస్తే.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) మాత్రం ఇకపై వినియోగదారులు ఆందోళన చెందనక్కర్లేదని అంటోంది.

BSNL Plan : ఇదెక్కడి బాధరా బాబూ.. సెకండ్ సిమ్‌కి నెలనెలా రీచార్జ్ చేయాల్సి వస్తుందనుకుంటున్నారా?.. బీఎస్ఎన్ఎల్ ఖతర్నాక్ రీచార్జ్ ప్లాన్

BSNL Recharge Plan

Updated On : January 24, 2025 / 5:02 PM IST

BSNL Recharge Plan : ప్రస్తుత రోజుల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు కాలక్రమేణా ఖరీదైనవిగా మారుతున్నాయి. ఇప్పుడు ప్రతిఒక్కరి ఫోన్లలో డ్యూయల్ సిమ్‌లు కామన్ అయింది. అయితే, రెండు సిమ్‌లలో ప్రతినెలా రీచార్జ్ చేయాలంటే జేబుకు భారమే మరి. కొంతమందికి నెలవారీ రీఛార్జ్ చేయించడం అనేది చాలా కష్టంగా మారింది కూడా.

ముఖ్యంగా ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రొవైడర్లు మొబైల్ టారిఫ్ ధరలను అమాంతం పెంచేశారు. ఇటీవలి పెంపుల తర్వాత రెండు సిమ్‌లకు రీఛార్జ్ చేయడం మరింత భారంగా మారింది. గడువు తేదీలోగా రీఛార్జ్ చేయకపోతే ఆయా సిమ్ కార్డులను యాక్టివ్ ఉంచలేని పరిస్థితి. ప్రస్తుతం మొబైల్ ఫోన్ యూజర్లకు ఆర్థికంగా పెద్ద తలనొప్పిగా మారుతుంది.

Read Also : Relief for EPF members : ఈపీఎఫ్ సభ్యులకు రిలీఫ్.. ఇకపై డాక్యుమెంట్లతో పనిలేదు.. ఈ కొత్త రూల్‌తో ప్రొఫైల్ అప్‌డేట్ చాలా ఈజీ..!

అయితే, ఇతర టెలికం దిగ్గాలతో పోలిస్తే.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) మాత్రం ఇకపై వినియోగదారులు ఆందోళన చెందనక్కర్లేదని అంటోంది. వినియోగదారులపై రీఛార్జ్ భారాన్ని తగ్గించేందుకు కొన్ని సరసమైన ఆప్షన్లతో ముందుకొచ్చింది. యూజర్లను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ఖతర్నాక్ ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది. అదే.. బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్.. 10 నెలల పాటు అందించే సరసమైన ప్లాన్.. ఖరీదైన ప్లాన్లల కోసం తరచూ రీఛార్చ్ చేయడంలో విసిగిపోయినవాళ్లకు బీఎస్ఎన్ఎల్ గేమ్ ఛేంజర్‌గా కొత్త ఆఫర్ అందిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ 10 నెలల సరసమైన ప్లాన్ ఇదిగో :
బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం 10 నెలల అత్యంత సరసమైన ప్లాన్‌ అందిస్తోంది. దీంతో మీరు నెలవారీ రీఛార్జ్‌లు చేయనక్కర్లేదు. చాలా డబ్బుని కూడా ఆదా చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ ఖర్చులను తగ్గించుకోవాలనే వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

కేవలం రూ.797తో 300 రోజుల వ్యాలిడిటీ :
బీఎస్ఎన్ఎల్ అనేక ఖర్చుతో కూడుకున్న రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. వినియోగదారులు బ్యాంకు ఆఫర్లపై ఆధారపడకుండా లాంగ్ టైమ్ సర్వీసును పొందవచ్చు. ఇందులో స్టాండ్‌అవుట్ ప్లాన్ సింగిల్ రీఛార్జ్‌తో 300-రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. కేవలం రూ. 797తో ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. మీ బీఎస్ఎన్ఎల్ నంబర్ 10 నెలల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. దాదాపు ఏడాది పాటు ఎలాంటి అంతరాయం లేని సర్వీసును ఎంజాయ్ చేయొచ్చు.

మొదటి 60 రోజుల వ్యవధి తర్వాత :
ఈ ప్లాన్ ఇప్పటికే వినియోగదారులకు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తక్కువ-ధరలో రీఛార్జ్ ప్లాన్ల కోసం వెతికేవారికి రూ. 797 ప్లాన్ బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ ప్లాన్ తీసుకుంటే.. మీరు 300 రోజుల వ్యాలిడీటిని ఎంజాయ్ చేయొచ్చు. కానీ, ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. రీఛార్జ్ చేసుకున్న మొదటి 60 రోజుల పాటు మీరు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా (మొత్తం 120జీబీ), రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను పొందుతారు. అయితే, ఈ 60 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత ప్లాన్ అవుట్‌గోయింగ్ కాల్స్, డేటా లేదా ఎస్ఎంఎస్‌కి సపోర్టు ఇవ్వదని గమనించాలి.

ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకున్న మొదటి రెండు నెలల తర్వాత మీరు ఈ సర్వీసులను ఉపయోగించాలనుకుంటే.. మీరు మరో ప్లాన్‌కు మారాలి. ఈ రూ. 797 ఆప్షన్ ప్రధానంగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ సెకండరీ సిమ్‌గా ఉపయోగించేవారికి, రీఛార్జ్‌ల కోసం ఎక్కువ ఖర్చు చేయొద్దని భావించే వినియోగదారులకు సరైనదిగా చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా బీఎస్ఎన్ఎల్ సెకండరీ సిమ్ వాడుతుంటే వెంటనే ఈ రీఛార్జ్ ప్లాన్ తీసుకోండి. ఏకంగా 10 నెలల పాటు నిరంతరాయంగా సర్వీసులను ఎంజాయ్ చేయండి.

Read Also : Honda Activa 2025 : హోండా యాక్టివా 2025 వచ్చేసిందోచ్.. ఈ స్కూటర్‌లో ఫీచర్లే హైలెట్ భయ్యా.. ధర ఎంత ఉందంటే?