తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్… సూపర్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్…

మొత్తంగా చూస్తే.. రూ.7,000 లోపు బడ్జెట్‌లో మంచి డిస్‌ప్లే, పనితీరు, డీసెంట్ కెమెరా, రోజంతా నిలిచే బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఈ స్మార్ట్‌ఫోన్‌ కచ్చితంగా నచ్చుతుంది.

తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్… సూపర్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్…

Updated On : June 2, 2025 / 1:27 PM IST

తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, రియల్‌మీ నార్జో N61 (Realme Narzo N61) గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కేవలం రూ.7,000లోపే లభ్యమవుతున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో, ఎందుకు ఇది బెస్ట్ డీల్ అవుతుందో డీటెయిల్‌గా చూద్దాం…

ఆకట్టుకునే డిస్‌ప్లే, స్టైలిష్ డిజైన్

రియల్‌మీ నార్జో ఎన్‌61 స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చింది. ఇది 1600×720 పిక్సెల్స్ రెసల్యూషన్‌తో ఉంది. దీనిలోని 90Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, గేమింగ్, వీడియో ఎక్స్‌పీరియెన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. స్క్రీన్ బ్రైట్‌నెస్ 560 నిట్స్ వరకు ఉండటం వలన, అధిక వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా, ఈ ఫోన్‌కు IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉంది.

పనితీరు

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను Unisoc T612 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఇది రోజువారీ పనులకు, సాధారణ గేమింగ్‌కు చక్కగా సరిపోతుంది. ఈ ఫోన్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 128GB వరకు పెంచుకునే సౌలభ్యం కూడా ఉంది. సాధారణ యాప్స్ వినియోగం, మల్టీటాస్కింగ్ వంటి వాటికి ఈ కాన్ఫిగరేషన్ సరిపోతుంది.

ఆకట్టుకునే కెమెరా సెటప్

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. రియల్‌మీ నార్జో N61 బ్యాక్‌సైడ్ 32MP AI మెయిన్‌ కెమెరా ఉంది. దీనికి LED ఫ్లాష్, పోర్ట్రెయిట్ షాట్స్ కోసం సెకండరీ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. పగలు సమయంలోని వెలుతురులో మంచి నాణ్యతతో ఫొటోలు తీస్తుంది. ఫ్రంట్‌సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP AI సెల్ఫీ కెమెరా ఉంది.

రోజంతా నిలిచే బ్యాటరీ, ఛార్జింగ్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది సాధారణ వినియోగంలో ఒక రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లోనే ఛార్జర్ కూడా లభిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.

అమెజాన్‌లో ఆఫర్ వివరాలు

రియల్‌మీ నార్జో N61 (4GB+64GB) అసలు ధర రూ.8,999 కాగా, ప్రస్తుతం అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్ కింద రూ.7,498కే అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా రూ.900 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.7,000 కంటే తక్కువకు (సుమారు రూ.6,598కు) తగ్గుతుంది. కొన్ని బ్యాంక్ ఆఫర్‌లతో రూ.224 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా మరింత తగ్గింపు కూడా పొందవచ్చు.

మొత్తంగా చూస్తే.. రూ.7,000 లోపు బడ్జెట్‌లో మంచి డిస్‌ప్లే, పనితీరు, డీసెంట్ కెమెరా, రోజంతా నిలిచే బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి రియల్‌మీ నార్జో N61 కచ్చితంగా నచ్చుతుంది.