Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ : ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, షావోమీ 14పై భారీ డిస్కౌంట్లు..!

Amazon Great Indian Festival 2024 Sale : అమెజాన్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, షావోమీ 14 వంటి ఇతర టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా మరెన్నో ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చు

Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ : ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, షావోమీ 14పై భారీ డిస్కౌంట్లు..!

Amazon Great Indian Festival 2024 Sale

Updated On : September 21, 2024 / 8:51 PM IST

Amazon Great Indian Festival 2024 Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ ఈ నెల (సెప్టెంబర్) 27న కొనుగోలుదారులందరికీ అందుబాటులోకి రానుంది. రాబోయే పండుగ సీజన్‌కు ముందు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరే డీల్స్ ప్రకటించింది. కొనుగోలుదారులు ఐఫోన్ 13ని రూ. 38వేల లోపు పొందవచ్చు.

Read Also : iPhone 16 Discount : కొత్త ఐఫోన్ 16 కొంటున్నారా? ఇలా చేస్తే.. రూ. 55వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!

అమెజాన్ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, షావోమీ 14 వంటి ఇతర టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా మరెన్నో ఆఫర్లు అందిస్తోంది. కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ పొందవచ్చునని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌ల కోసం సెప్టెంబరు 26న సేల్ ప్రారంభం కానున్నప్పటికీ కొనుగోలుదారులు ఇప్పుడే విష్‌లిస్ట్ చేయవచ్చు. సేల్ ప్రారంభమైన వెంటనే వాటిని కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై ఆఫర్లు :
అమెజాన్ ఐఫోన్ 13 పై “కింగ్ ఆఫ్ ఆల్ డీల్స్” ఆఫర్‌ను వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ రూ. 79,900, ప్రస్తుతం రిటైల్ రూ. 49,900కు అందిస్తోంది. అయితే, కొనుగోలుదారులు ఈ ఐఫోన్ 13 ధరను బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 37,999కు కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఆపిల్ ఎ15 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. 12ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్‌తో పాటు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం గత ఏడాది నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాపై భారీగా ధరను తగ్గించింది. ఈ ఫోన్ ధర రూ. 1,49,999 ఉండగా, కేవలం 69,999 ధరకు అందిస్తోంది. ఈ ఆఫర్ బ్యాంక్, కూపన్ డిస్కౌంట్‌లతో వస్తుందని గమనించాలి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సమయంలో షావోమీ 14 ధర తగ్గింపుతో కూడా అందుబాటులో ఉంటుంది. అన్ని డిస్కౌంట్లతో సహా షావోమీ ధర రూ. 47,999కు అందిస్తోంది. ముఖ్యంగా, భారత మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 69,999 నుంచి అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే రాబోయే సేల్‌కు ముందు అనేక కిక్‌స్టార్టర్ డీల్స్ రివీల్ చేసింది. కొనుగోలుదారులు తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S24 Price : శాంసంగ్ గెలాక్సీ ఫోన్ S24 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌‌లో ఇంకా తక్కువకే కొనేసుకోవచ్చు..!