Apple iOS 26 Beta 3 : ఆపిల్ లవర్స్ మీకోసమే.. కొత్త ఫీచర్లతో iOS 26 బీటా 3 డౌన్‌లోడ్‌.. ఐఫోన్లలో ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే?

Apple iOS 26 Beta 3 : ఆపిల్ WWDC 2025లో iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. ప్రారంభంలో బీటా వెర్షన్‌లోని బగ్స్ సమస్యలు తలెత్తాయి.

Apple iOS 26 Beta 3

Apple iOS 26 Beta 3 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆపిల్ WWDC 2025లో ఐఫోన్ల కోసం iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రకటించింది. అయితే, ప్రారంభంలో బీటా 1 వెర్షన్‌లో (Apple iOS 26 Beta 3) బగ్స్ కారణంగా ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ఫెయిల్ అయింది. దాంతో ఆపిల్ చివరకు iOS 26 బీటా 3 అప్‌డేట్స్ రిలీజ్ చేసింది. తక్కువ బగ్స్ కలిగి ఉండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. చివరి అప్‌డేట్‌‌తో పోలిస్తే కొత్తగా ఆపిల్ అనేక మార్పులు చేసింది.

iOS 26 బీటా 3 అప్‌డేట్ అర్హతలివే :
iOS 26 బీటా 3 అన్ని రిజిస్టర్డ్ బీటా టెస్టర్లు, డెవలపర్‌లకు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌గా అందుబాటులో ఉంది. iOS 26 బీటా 3 రన్ చేసేందుకు కనీసం ఐఫోన్ 11 లేదా అంతకంటే ఆపై వెర్షన్ కలిగి ఉండాలి. అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు ఐఫోన్ 15 ప్రో, ఆపై మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని గమనించాలి.

ఐఫోన్‌లో iOS 26 బీటా 3 అప్‌డేట్‌ డౌన్‌లోడ్ ఎలా? :
ఈ కొత్త iOS 26 బీటా అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. బీటా టెస్టర్లతో పాటు ఆపిల్ డెవలపర్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారందరూ సెట్టింగ్స్‌కు వెళ్లి ఆపై General ట్యాబ్ ఎంచుకోవాలి. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ (Software Update) వద్ద కొత్త వెర్షన్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy Event : శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్.. ఈరోజే 2 ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్.. లాంచ్ లైవ్ స్ట్రీమింగ్‌ ఎలా చూడాలంటే?

iOS 26 బీటా 3 అప్‌డేట్, కొత్త ఫీచర్లు :
కొత్త iOS 26 బీటాలో ఆపిల్ కొన్ని మార్పులు చేసింది. యాప్ స్టోర్, పాడ్‌కాస్ట్‌లు, ఆపిల్ మ్యూజిక్ వంటి యాప్స్ వాడితే నావిగేషన్ బార్‌లు లో-ట్రాన్స్‌పరెన్సీతో కనిపిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆధారంగా ట్రాన్స్ పరెన్సీ లెవల్స్ పరంగా సఫారి కూడా అప్‌గ్రేడ్ అయింది.

నోటిఫికేషన్‌లు బ్రైట్ కలర్‌లో కనిపిస్తాయి. అక్షరాలను చదివేందుకు వీలుగా ఉంటాయి. iOS 26 వాల్‌పేపర్ కోసం కొత్త కలర్ ఆప్షన్లను కూడా పొందొచ్చు. డస్క్, స్కై, షాడో, హాలో అనే బ్లూ కలర్ డిఫరెంట్ షేడ్స్‌ను అందిస్తాయి. ఇందులో ఒకటి పర్పల్ కలర్ ఉంటుంది. కంట్రోల్ సెంటర్‌కు ఆపిల్, Wi-Fi, ఎయిర్‌డ్రాప్, బ్లూటూత్, సెల్యులార్ టోగుల్స్ కోసం బ్లూ, గ్రీన్ ఐకాన్లు ఉంటాయి.