Iphone 12: ఐఫోన్ 12 అద్భుతమైన డీల్ రూ.24వేల900కే..

బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో యాపిల్ ఐఫోన్ ఒకటి. లాంచ్ అయి సంవత్సరం దాటిన ఐఫోన్ 12 ఆఫర్లు ఊరిస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ యాండ్రాయిడ్ ఫోన్లు ఇవ్వలేనన్ని ఫీచర్లు ఉండటంతో ఫస్ట్ ప్రియారిటీని..

Iphone 12: ఐఫోన్ 12 అద్భుతమైన డీల్ రూ.24వేల900కే..

Apple Iphone

Updated On : March 14, 2022 / 7:18 PM IST

Iphone 12: బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో యాపిల్ ఐఫోన్ ఒకటి. లాంచ్ అయి సంవత్సరం దాటిన ఐఫోన్ 12 ఆఫర్లు ఊరిస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ యాండ్రాయిడ్ ఫోన్లు ఇవ్వలేనన్ని ఫీచర్లు ఉండటంతో ఫస్ట్ ప్రియారిటీని దక్కించుకుంటుంది. ఇదిలా ఉంటే తొలి సారి ఇండియాలో ఐఫోన్ 12 లాంచ్ అయినప్పుడు ధర రూ.79వేల 900గా ఉంటే గతేడాది ఐఫోన్ 13లాంచ్ అయిన తర్వాత ధరను రూ.65వేల 900కు తగ్గించింది యాపిల్.

అలాంటిది ఇప్పుడు Iphone 12 రూ.24వేల 900కే వస్తుందంటే నమ్ముతారా.. అవును నిజమే. ఈ అద్భుతమైన డీల్ సొంతం చేసుకోండి.

Aptronix అనే ఇండియాలోని యాపిల్ ప్రీమియం రీసెల్లర్స్ లో ఒకటైన్ ప్లాట్ ఫాం ఐఫోన్ 12ను రూ.24వేల 900కు అమ్ముతుంది. రూ.65వేల 900 నుంచి రూ.24వేల 900కు దొరుకుతుంటే దాదాపు రూ.41వేల డిస్కౌంట్ దక్కుతుంటే ఇక వెనక్కు చూడాల్సిన అవసరమేముంది.

Read Also: మార్కెట్లో కొత్త ఫోన్ల సందడి: ఐఫోన్, శాంసంగ్, రెడ్మి నుంచి కొత్త ఫోన్లు

ముందుగా, ఐఫోన్ 12పై రూ. 9వేల 900 ఫ్లాట్ తగ్గింపు ఉంది. ఇది ఎలాంటి కార్డ్ లేదా డిస్కౌంట్ కూపన్‌ను ఉపయోగించకుండానే మీకు అందుబాటులో ఉంటుంది. అలా ధర తగ్గిన తర్వాత, iPhone 12 64GB ధర రూ. 56వేలకు వస్తుందన్నమాట. ఆ తర్వాత రూ. 5వేలు క్యాష్‌బ్యాక్ పొందడానికి ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా SBI నుండి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. అంటే ఇప్పటివరకూ మీరు iPhone 12 కొనుగోలు చేయడానికి ధర రూ. 51వేలు వెచ్చించినట్లు అన్నమాట.

ఇక తర్వాతి డిస్కౌంట్ రావడానికి మీ ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఐఫోన్ 11 ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే దాదాపు రూ.23వేల 100 వెల కట్టేందుకు రెడీ అయింది Aptronix. మంచి కండిషన్ లో ఉండి, ఎటువంటి ఫిజికల్ డ్యామేజి కూడా లేకుండా ఉంటే ఎక్స్‌ఛేంజ్ ధర అధికంగా ఉండటంతో పాటు రూ.3వేల బోనస్ కూడా ఉంటుందని సైట్ లో పేర్కొన్నారు. అలా చూసుకుంటే మొత్తం ధర రూ.26వేల 100 అన్నమాట.

ఒరిజినల్ ధరలో నుంచి ఎక్స్‌ఛేంజ్ ధరను తీసి వేస్తే ఐఫోన్ రూ.24వేల 900కే కొనుగోలు చేసినట్లు అవుతుంది.

Read Also: ఐఫోన్ వదిలేయండి.. AYYA T1ని వాడండి