Apple iPhone 14 discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.57వేలకే సొంతం చేసుకోవచ్చు!
Apple iPhone 14 discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 బేస్ వేరియంట్‌పై ఏకంగా రూ.12,901 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
- Sreehari A
- Published On : March 26, 2024 / 06:13 PM IST
Apple iPhone 14 available at a discount on Flipkart, can be yours for under Rs 57k only
Apple iPhone 14 discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డీల్ అందిస్తోంది. మీరు కొత్త ఐఫోన్ 15 ఫోన్ కొనేందుకు అంత బడ్జెట్ లేదని భావిస్తే.. ఈ ఐఫోన్ 14 ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఐఫోన్ ప్రత్యేక డీల్‌తో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14పై 8 శాతం తగ్గింపును అందిస్తోంది. అంటే.. రూ. 56,999కి ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. మరింత తగ్గింపు పొందాలంటే ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 డీల్ :
ఫ్లిప్‌కార్ట్‌లో 128జీబీ స్టోరేజీతో ఐఫోన్ 14 బేస్ వేరియంట్ రూ. 12,901 ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ.69,900 ఉండగా.. రూ. 56,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. అంతేకాదు.. ఈ ఐఫోన్ 14 కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
యూపీఐ లావాదేవీలపై రూ.750 డిస్కౌంట్ కూడా ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ఐఫోన్ 14ని ఇంకా తక్కువ ధరకు పొందవచ్చు. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఐఫోన్ ధర తగ్గింపు ఉంటుంది. మీ ప్రాంతం ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు అర్హత కలిగి ఉందో లేదో చెక్ చేసేందుకు మీరు చేయాల్సిందల్లా.. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో మీ పిన్‌కోడ్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది.
ఐఫోన్ 14 స్పెషిఫికేషన్లు :
ఐఫోన్ 14 మోడల్ 2022లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఐఫోన్ లైనప్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14, 2021 ఐఫోన్ 13 మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు ప్రాసెసర్, డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్ వంటి కొన్ని మార్పులతో అప్‌గ్రేడ్ అయ్యాయి. అదే డైనమిక్ ఐలాండ్ నాచ్ ఇప్పుడు అన్ని ఐఫోన్ 15 మోడళ్లలోనూ అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 మోడల్‌ను ఐఫోన 13తో పోల్చినప్పుడు కెమెరా కొన్ని అప్‌గ్రేడ్స్ అందుకుంది.
బ్యాక్ కెమెరాలో ఫోటోనిక్ ఇంజిన్ తక్కువ-కాంతిలోనూ ఫోటోగ్రఫీ అద్భుతంగా అందించగలదు. సరైన కాంతిలోనూ ఫోటోగ్రఫీ ఐఫోన్ 13, ఐఫోన్ 14తో సమానంగా ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 13, ఐఫోన్ 14 రెండూ 12ఎంపీ కెమెరాలపై పనిచేస్తాయి. ఐఫోన్ 13 మోడల్ 2.2 ఎపర్చరుతో పోలిస్తే.. ఐఫోన్ 14 మోడల్ 1.9 ఎపర్చరును కలిగి ఉంది. ఐఫోన్ 14 మొదటిసారిగా ఫ్రంట్ కెమెరాలో ఆటో-ఫోకస్ ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేసింది.
