Realme Narzo 70 Pro 5G : రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఈ ఫోన్ ధర, బ్యాంక్ ఆఫర్లు, టాప్ ఫీచర్లు ఇవే!
Realme Narzo 70 Pro 5G First Sale : రియల్ మి నార్జో 70ప్రో 5జీ ఫోన్ గత రెండు రోజుల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. మార్చి 28 వరకు కొనసాగుతుంది.

Realme Narzo 70 Pro 5G first sale begins today_ Check price, bank offers and top specs
Realme Narzo 70 Pro 5G First Sale : భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి సరికొత్త 5జీ ఫోన్ రియల్‌మి నార్జో 70ప్రో గతవారమే లాంచ్ అయింది. అయితే, ఇప్పుడు ఈ 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 కెమెరా, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగిన అమోల్డ్ డిస్‌ప్లేతో, ఫోన్ అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. ఈ నార్జో ఫోన్‌లు, మార్కెట్‌లోని ఇతర ఫోన్‌లతో పోలిస్తే.. తక్కువ ధరలకే ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను అందిస్తాయి.
రియల్‌మి నార్జో 70ప్రో 5జీ లైవ్ కామర్స్ సేల్ మార్చి 22న ప్రారంభమైంది. ఈ బ్రాండ్ పరిమిత కాలం పాటు రూ. 2,299 విలువైన సరికొత్త రియల్‌మి బడ్స్ టీ300 (డోమ్ గ్రీన్ కలర్)ని బహుమతిగా అందిస్తోంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు (మార్చి 26న) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. మార్చి 28 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో అందించే అనేక బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్‌మి నార్జో 70ప్రో 5జీ సేల్ :
రియల్‌మి నార్జో 70ప్రో 5జీ ఫోన్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మొత్తం (8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ) అనే 2 స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. అందులో 128జీబీ వేరియంట్ ధర రూ. 19,999కి అమ్మకానికి ఉంది. 256జీబీ వేరియంట్ రూ.21,999కి పొందవచ్చు. కొనుగోలుదారులు 8జీబీ+128జీబీ వేరియంట్‌పై రూ.1,000, 8జీబీ+256జీబీ వేరియంట్‌పై రూ.2వేలు ప్రత్యేక తగ్గింపును పొందవచ్చు.
బ్యాంక్ ఆఫర్ తర్వాత 128జీబీ వేరియంట్ ధర రూ. 18,999 అవుతుంది. 256జీబీ వేరియంట్ ధర రూ. 19,999కి సొంతం చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు మాత్రమే బ్యాంక్ ఆఫర్‌లను పొందగలరని గమనించాలి. దాంతో పాటు, మీ పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేయడంపై అదనపు డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, రూ. 10వేల వరకు జియో బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
రియల్‌మి నార్జో 70ప్రో 5జీ టాప్ స్పెషిఫికేషన్లు :
రియల్‌మి నార్జో 70 ప్రో బ్యాక్ సైడ్ హారిజన్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్లిమ్ బెజెల్స్, పంచ్-హోల్ డిస్‌ప్లేతో ఫ్లాట్-స్క్రీన్ డిజైన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 7050 5జీ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ మాలి-జీ68 జీపీయూతో లీనమయ్యే గేమింగ్, మల్టీమీడియా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీతో పాటు 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జ్‌తో రియల్‌మి నార్జో 70 ప్రో లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఫోన్ కెమెరా ఫ్రంట్ సైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) 2ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్‌తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ సెన్సార్‌తో పాటు సెల్ఫీలు, వీడియోల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ మాస్టర్‌షాట్ అల్గోరిథం కూడా ఉంది. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ఎయిర్ గెచ్చర్స్ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా ఉంది. వినియోగదారులు ఈ డివైజ్ తాకకుండానే ఫోన్‌ను కంట్రోల్ చేయొచ్చు. అదనంగా, అధికంగా వినియోగించినా ఫోన్ వేడిని నిరోధించే 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
Read Also : Poco C61 Launch : భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో పోకో C61 ఫోన్ లాంచ్.. భారత్‌లో ధర కేవలం రూ.6,999 మాత్రమే!