Flipkart Month-End Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు : ఈ ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఐఫోన్ ధర ఎంత తగ్గిందంటే?
Flipkart Month-End Mobiles Fest : ఫ్లిప్‌కార్ట్ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ ప్రారంభమైంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మాక్స్ వంటి అనేక ఐఫోన్‌లపై భారీ తగ్గింపులను పొందవచ్చు.

Flipkart Month-End Mobiles Fest _ Big discounts on iPhone 15, iPhone 14, iPhone 13 and more
Flipkart Month-End Mobiles Fest : ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్‌ని నిర్వహిస్తోంది. ఆపిల్ ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మాక్స్ వంటి పాపులర్ ఐఫోన్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి.
ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 30 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. అంటే ఐఫోన్‌లలో డీల్‌లను పొందడానికి వినియోగదారులకు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ డీల్స్‌లో ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లు రెండూ ఉన్నాయి. ఐఫోన్ల డీల్స్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 14 మోడల్ 128జీబీ స్టోరేజ్ మోడల్ అసలు ధర రూ. 69,900 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ ఈ మోడల్ ఐఫోన్ రూ. 56,999 ప్రారంభ ధరకు అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 12,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. యూపీఐ లావాదేవీలు చేసే యూజర్లు ఐఫోన్‌పై రూ. 750 అదనపు డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కలిగిన యూజర్లు ఇదే ఐఫోన్‌పై రూ. 2,850 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు.
ఐఫోన్లపై బ్యాంకు ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు :
అదేవిధంగా, ఆపిల్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 15 రిటైల్ ధర రూ. 79,900 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 66,999 ధరతో విక్రయిస్తోంది. ఈ ధర 128జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మోడల్ వర్తిస్తుంది. దీని ప్రకారం.. వినియోగదారులు రూ. 12,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ క్రెడిట్ కార్డ్‌తో ఐఫోన్ 15పై రూ. 3,350 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్లాట్‌ఫారమ్‌లో మరిన్ని ఇతర బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.
మీ బడ్జెట్ దాదాపు రూ. 50వేలు అయితే, ఐఫోన్ 13ని రూ. 52,999కి కొనుగోలు చేయొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. అదనంగా రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. తద్వారా ఐఫోన్ ధరను రూ.51,999కి పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌తో ఇదే ఐఫోన్ మోడల్‌పై రూ. 2,650 తగ్గింపు పొందవచ్చునని ప్లాట్‌ఫారమ్ మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ పేజీలో పేర్కొంది. అన్ని ఫోన్‌లలో కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను ఎంచుకోవచ్చు. ఈ జాబితాలోని ప్రతి ఫోన్ విభిన్న ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంటుంది. మీ పాత ఫోన్ కండిషన్ ఆధారంగా తగ్గింపు పొందవచ్చు.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,59,900 నుంచి భారీగా తగ్గింది. ప్రస్తుతం ఈ ఐఫోన్ మోడల్ రూ. 1,48,900తో అందుబాటులో ఉంది. అంతేకాదు.. ఐఫోన్ 15 ప్రోను ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 1,27,990 వద్ద కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో రూ. 1,34,900కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్ రూ. 66,999కి అమ్మకానికి ఉంది.