Pavan Davuluri : మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి, భారతీయ దిగ్గజాల జాబితాలో చోటు

Pavan Davuluri : ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన పవన్ దావులూరి మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్‌కి కొత్త హెడ్‌గా నియమితులయ్యారు. ప్రధాన యూఎస్ టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల దిగ్గజాల్లో దావులూరి చేరారు.

Pavan Davuluri : మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి, భారతీయ దిగ్గజాల జాబితాలో చోటు

IIT Madras graduate Pavan Davuluri is new Microsoft Windows boss

Pavan Davuluri : మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్ కొత్త హెడ్‌గా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరి నియమితులయ్యారు. గతంలో డిపార్ట్‌మెంట్‌కు నాయకత్వం వహించిన పనోస్ పనాయ్ నిష్క్రమించడంతో ఆయన స్థానంలో దావులూరి బాధ్యతలు చేపట్టారు. అమెజాన్‌లో చేరేందుకు పనాయ్ గతేడాది తన పదవికి రాజీమా చేశారు. ముఖ్యంగా, మైక్రోసాఫ్ట్ విండోస్, సర్ఫేస్ గ్రూపులుగా విభజించింది. ఒక్కొక్కటి ప్రత్యేక నాయకత్వంలో కొనసాగుతున్నాయి. గతంలో, దావులూరి సర్ఫేస్ సిలికాన్ విధులను పర్యవేక్షించగా, మిఖాయిల్ పరాఖిన్ విండోస్ విభాగానికి నాయకత్వం వహించారు.

Read Also : Apple iPhone 14 Plus : రూ.50వేల లోపు ధరకే ఐఫోన్ 14 ప్లస్ సొంతం చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ పొందాలంటే?

భారతీయ దిగ్గజాల సరసన ఐఐటీ మద్రాసు గ్రాడ్యుయేట్ :
అయినప్పటికీ, కొత్త రోల్స్ చేపట్టాలనే పరాఖిన్ కోరిక మేరకు దవులూరి విండోస్, సర్ఫేస్ రెండింటికీ బాధ్యతలు తీసుకున్నారు. దావులూరికి భారతీయతతో సంబంధం ఉంది. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ మద్రాసు నుంచి పట్టభద్రుడయ్యారు. విండోస్ బాస్ నియమితులైన దావులూరి అమెరికాలోని టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల దిగ్గజాల ర్యాంక్‌లో చేరాడు. ఇప్పటికే ఈ ర్యాంకుల్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారితో పాటు మరికొందరు ఉన్నారు.

పరాఖిన్ స్థానంలో దావులూరికి పగ్గాలు :
పరాఖిన్ నిష్క్రమణతో దావులూరికి విండోస్ హెడ్‌గా పగ్గాలు అందించారు. ఈ మార్పులో భాగంగా ఎక్స్‌పీరియన్స్+ డివైజెస్ (E+D) విభాగంలో ప్రధాన భాగంగా విండోస్ ఎక్స్‌పీరియన్స్, విండోస్+ డివైజ్ బృందాలను ఒకచోట చేర్చింది. ఈ ఏఐ యుగంలో విండోస్ క్లయింట్, క్లౌడ్‌లో విస్తరించి ఉన్న సిలికాన్, సిస్టమ్స్, డివైజ్‌లను రూపొందించడానికి వీలుగా ఉంటుందని కంపెనీ మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్, డివైజెస్ అధిపతి రాజేష్ ఝా పేర్కొన్నారు. పవన్ దావులూరి ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. శిల్పా రంగనాథన్, జెఫ్ జాన్సన్ బృందాలు నేరుగా పవన్‌కు రిపోర్ట్ చేస్తారు. విండోస్ బృందం ఏఐ, సిలికాన్, అనుభవాలపై మైక్రోసాఫ్ట్ ఏఐ బృందంతో కలిసి పని చేస్తారని రాజేష్ ఝా కంపెనీ అంతర్గత లేఖలో వెల్లడించారు.

మైక్రోసాఫ్ట్‌తో 23ఏళ్లకు పైగా అనుబంధం :
దావులూరికి మైక్రోసాఫ్ట్‌తో 23 సంవత్సరాలకుపైగా అనుబంధం ఉంది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత దావులూరి మైక్రోసాఫ్ట్‌లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా చేరారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సంస్థ స్థాపన తర్వాత విండోస్, వెబ్ ఎక్స్‌పీరియన్స్ (WWE) బృందంలో సంస్థాగత మార్పుల గురించి రాజేష్ ఝా బృందానికి మెమోలో తెలియజేశారు. కెవిన్ స్కాట్ పర్యవేక్షణలో మిఖాయిల్ పరాఖిన్ (WWE) నుంచి కొత్త పాత్రలను మారారు. విండోస్ ఎక్స్‌పీరియన్స్, విండోస్ + డివైజ్‌లను ఎక్స్‌పీరియన్స్ + డివైసెస్ (E+D) విభాగంలో విలీనం చేయడంతో పవన్ దావులూరి నేతృత్వంలోని ఏఐ విభాగం సిస్టమ్‌లు, ఎక్స్‌పీరియన్స్ డివైజ్‌‌లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. శిల్పా రంగనాథన్, జెఫ్ జాన్సన్ నేరుగా దావులూరికి రిపోర్ట్ చేస్తారు.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.10,901 తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!