Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Apple iPhone 14 Plus : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరతో వచ్చింది. అయితే మీరు (Flipkart Big Diwali Sale)లో రూ. 43,500 తగ్గింపు తర్వాత ఐఫోన్ 14 ప్లస్ కేవలం రూ. 20,400 వద్ద పొందవచ్చు.

Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Apple iPhone 14 Plus available at Rs 20,400 in Flipkart Big Diwali Sale

Updated On : November 6, 2023 / 3:03 PM IST

Apple iPhone 14 Plus : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌ (Flipkart Big Diwali Sale)లో కొనుగోలుదారుల నుంచి ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ అద్భుమైన ఆదరణ పొందింది. ఎందుకంటే.. ఈ ఐఫోన్ అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ బ్లూ, పర్పుల్, మిడ్‌నైట్, స్టార్‌లైట్, రెడ్ అనే 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ (iPhone 13 Pro) మోడల్‌లలో కనిపించే విధంగా స్మార్ట్‌ఫోన్ మెరుగైన A15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది.

సింగిల్ ఛార్జ్‌తో 26 గంటల బ్యాటరీ లైఫ్ :

కెమెరాల విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ 12ఎంపీ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ 5జీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 26 గంటల వరకు ఉంటుందని ఆపిల్ పేర్కొంది. భారత్‌ మార్కెట్లోకి ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరతో వచ్చింది. అయితే, మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో రూ. 43,500 తగ్గింపుతో ఐఫోన్ 14 ప్లస్‌ను కేవలం రూ. 20,400 వద్ద సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 14 Plus available at Rs 20,400 in Flipkart Big Diwali Sale

Apple iPhone 14 Plus  in Flipkart Big Diwali Sale

బ్యాంకు ఆఫర్లు, మరెన్నో ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు :

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ రూ. 15,901 తగ్గింపు తర్వాత రూ. 63,999కి లిస్టు చేసింది. దీనితో పాటు, కొనుగోలుదారులు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.62,499కి తగ్గింది. ఇది కాకుండా, కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌పై రూ. 42వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అన్ని ఆఫర్‌లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో, ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో కొనుగోలుదారులు ఐఫోన్ 14 ప్లస్‌ను కేవలం రూ. 20వేల ధరలో కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ సిరీస్‌లోని మినీ మోడల్‌కు బదులుగా ఐఫోన్ 14 ప్లస్‌ను గత ఏడాది కొనుగోలుదారులు పక్కన పెట్టారు. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 మాదిరిగానే అనేక ఫీచర్లను కలిగి ఉంది. కానీ, పెద్ద డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీతో ఉంటుంది. ఐఫోన్ 14 ప్లస్ బేస్ మోడల్ భారత్ ధర రూ. 89,900 వద్ద లాంచ్ అయింది. ఐఫోన్ 15 ప్లస్ లాంచ్ తర్వాత, కంపెనీ ఈ ఐఫోన్ ధరను రూ. 10వేలకు తగ్గించింది.

ఆపిల్ 14 ప్లస్ ఫుల్ స్పెషిఫికేషన్లు :

Soc : ఆపిల్ A15 బయోనిక్
డిస్‌ప్లే : 6.7-అంగుళాల OLED, 60Hz, హెచ్‌డీఆర్ 10, 1200నిట్స్
స్టోరేజీ : 128జీబీ/256జీబీ/512జీబీ
బ్యాటరీ : 4,323mAh
పోర్ట్ : లైటనింగ్ (USB 2.0)
ఆపరేటింగ్ సిస్టమ్ : iOS16
ఫ్రంట్ కెమెరా : 12ఎంపీ, F/1.9, PDAF
కలర్లు : మిడ్‌నైట్, పర్పల్, స్టార్‌లైట్, బ్లూ, రెడ్
బరువు : 7.16 ఔన్స్ (203గ్రాములు)

Read Also : Top 8 SEO Ranking Tips : గూగుల్‌లో ర్యాంకింగ్ కోసం వెబ్‌సైట్ పోస్టులను ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఈ 8 SEO టిప్స్ తప్పక పాటించండి!