Apple iPhone 15 Pro : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై రూ.16,700 డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ ధర మోడల్ ఇతర బ్యాంక్ కార్డ్‌లతో విజయ్ సేల్స్‌లో ఆఫర్లను పొందవచ్చు. అయితే డిస్కౌంట్ మొత్తం మీరు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లతో కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది.
![Apple iPhone 15 Pro : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై రూ.16,700 డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే? Apple iPhone 15 Pro : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై రూ.16,700 డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?](https://10tv.in/wp-content/uploads/2024/04/Apple-iPhone-15-Pro-available-with-up-to-Rs-16700-discount-offer.jpg)
Apple iPhone 15 Pro available with up to Rs 16,700 discount offer
Apple iPhone 15 Pro : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ సిరీస్‌లోని ప్రో మోడల్‌లు రూ.1 లక్ష మార్కును దాటాయి. ఆపిల్ ఐఫోన్ ప్రో మోడల్‌ను కొనుగోలు చేయడం కొంచెం కష్టమే. అయినప్పటికీ, ఐఫోన్ 15 ప్రోపై యూజర్లు రూ. 16,700 వరకు మొత్తం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంకు కార్డులపై రూ. 10వేల తగ్గింపు ఆఫర్ :
ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ప్రో రూ. 1,28,200 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అసలు రిటైల్ ధర రూ. 1,34,900 నుంచి తగ్గింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.6,700 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లపై అదనంగా రూ. 10వేల తగ్గింపు ఆఫర్ పొందవచ్చు.
ఈ ఐఫోన్ ధర రూ.1,18,200కి తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ ధర మోడల్ ఇతర బ్యాంక్ కార్డ్‌లతో విజయ్ సేల్స్‌లో ఆఫర్లను పొందవచ్చు. అయితే డిస్కౌంట్ మొత్తం మీరు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లతో కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై మెరుగైన డీల్ పొందడానికి యూజర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఎంచుకోవచ్చు.
ఈ ప్లాట్‌ఫారమ్ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై గరిష్ట తగ్గింపును రివీల్ చేయలేదు. పాత ఫోన్ వివరాలను సైట్లో మాన్యువల్‌గా ఎంటర్ చేయడం ద్వారా డిస్కౌంట్ ఆఫర్‌ను చెక్ చేయాల్సి ఉంటుంది. ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ రూ. 1 లక్ష 50వేల కన్నా ధరకు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ 256జీబీ మోడల్ తగ్గింపు ధర రూ. 1,56,900తో అందుబాటులో ఉంది. ఐఫోన్ ప్రో మాక్స్ వెర్షన్‌పై రూ. 10వేల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధర రూ.1,46,900కు కొనుగోలు చేయొచ్చు.
Read Also : Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీగా ధర తగ్గింపు.. ఇంతకీ, ఈ ఫోన్ కొనాలా వద్దా?