iPhone 15 Sale Today : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై అదిరే సేల్.. ఏ ఐఫోన్ ధర ఎంతో తెలుసా? ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా ఇప్పుడే కొనేసుకోండి..!
iPhone 15 Sale Today : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ సేల్ మొదలైంది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మార్కెట్లో ఐఫోన్ కొనేసుకోవచ్చు. ఐఫోన్ల ధరలు, మరెన్నో ఆఫర్లను ఓసారి లుక్కేయండి.

Apple iPhone 15 to go on sale in India today_ check price, offers and more
iPhone 15 Sale Today : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఈరోజు (సెప్టెంబర్ 22) నుంచి ఆపిల్ ఐఫోన్ సేల్ (Apple iPhone Sale) మొదలైంది. భారత మార్కెట్లో (Apple) కొత్త iPhone 15 సిరీస్ విక్రయానికి అందుబాటులో ఉంది. ఫిజికల్ స్టోర్లు, ఆన్లైన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. (iPhone 15) నాలుగు వెర్షన్లు, వివిధ కలర్లు, స్టోరేజీ ఆప్షన్లతో పాటు, లేటెస్ట్ ఆపిల్ వాచ్ సిరీస్, USB-C పోర్టుతో AirPods ప్రో ఆపిల్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ఇప్పటికే (Apple iPhone 15) సిరీస్‌పై భారత్, 40 ఇతర దేశాలలో సెప్టెంబర్ 15న ప్రీఆర్డర్లను ప్రారంభించింది. ఈరోజు నుంచి కంపెనీ ఈ ప్రీఆర్డర్ల షిప్‌మెంట్‌ను కూడా ప్రారంభిస్తోంది. ఈ కొత్త ఐఫోన్ల సేల్ 40 కన్నా ఎక్కువ దేశాల్లో ప్రారంభమైంది. మకావు, మలేషియా, టర్కీ, వియత్నాం, 17 ఇతర ప్రాంతాల నివాసితులు కొత్త డివైజ్ కొనుగోలు చేసేందుకు సెప్టెంబర్ 29 వరకు ఆగాల్సిందే.
ఆపిల్ ఇటీవలే (Wonderlust) ఈవెంట్లో ఐఫోన్ 15 లైనప్‌లో ఐఫోన్ 15 సిరీస్ మొత్తం 4 వెర్షన్లను ఆవిష్కరించింది. ప్రామాణిక iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max వంటి ఫోన్లను అందిస్తోంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ అనే 3 స్టోరేజ్ (128GB, 256GB, 512GB) ఆప్షన్లలో వస్తాయి. అందులో పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ వంటి కలర్ రేంజ్ కలిగి ఉన్నాయి.
ఐఫోన్ 15 ధర ఎంతంటే? :
ఐఫోన్ 128GB స్టోరేజీతో కూడిన బేస్ మోడల్ (iPhone 15) రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, (iPhone 15 Plus) రూ. 89,900 వద్ద అందుబాటులో ఉంది. 128GB స్టోరేజ్‌తో ఐఫోన్ 15 ప్రోని చూసే వారికి రూ. 1,34,900కు అందిస్తోంది. 256GB స్టోరేజ్‌తో టాప్-టైర్ ఐఫోన్ 15 Pro మ్యాక్స్ ధర రూ.1,59,900కి వస్తుంది. ఆపిల్ స్టోర్‌లో మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 12 ఈవెంట్లో కంపెనీ USB-C పోర్టుతో సరికొత్త ఆపిల్ వాచ్ సిరీస్, AirPods ప్రోని కూడా ఆవిష్కరించింది. ఆపిల్ వాచ్ సిరీస్ 9 ప్రారంభ ధర రూ. 41,900, ఆపిల్ వాచ్ SE (2వ జనరేషన్) ధర రూ. 29,900 అవుతుంది.

Apple iPhone 15 to go on sale in India today_ check price, offers and more
అంతేకాదు.. ఆపిల్ కంపెనీ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో మరిన్ని తగ్గింపులను అందిస్తోంది. ఈ ఏడాదిలో ఆపిల్ ఇండియాలో మొదటి రెండు ప్రత్యేక రిటైల్ స్టోర్లను ముంబై, ఢిల్లీలో ఆవిష్కరించింది. ఈ ఆపిల్ స్టోర్లు కస్టమర్లకు టాప్ రేంజ్ ఫీచర్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రొడక్టుల సేల్స్, సర్వీసులు, అప్లియన్సెస్ కోసం వన్-స్టాప్ గమ్యస్థానాలుగా పనిచేస్తాయి. మీరు ఆపిల్ అభిమాని అయితే.. మీ సమీప ఆపిల్ స్టోర్‌లో లేదా ఆన్లైన్లో కొత్త iPhone 15 సిరీస్ ఇప్పుడే కొనుగోలు చేయండి.
ఐఫోన్ 15పై డిస్కౌంట్లు, మరెన్నో డీల్స్ :
* iPhone 15 : ధర రూ. 79,900, డిస్కౌంట్‌తో రూ. 74,900.
* iPhone 15 Plus : ధర రూ. 89,900, తగ్గింపుతో ఇప్పుడు రూ. 84,900.
* iPhone 15 Pro : ధర రూ. 1,34,900, తగ్గింపుతో ఇప్పుడు రూ. 128,900.
* iPhone 15 Pro Max : ధర రూ. 159,900, తగ్గింపుతో రూ. 153,900.
* iPhone 14 : ధర రూ. 69,900, తగ్గింపుతో ఇప్పుడు ధర రూ. 65,900.
* iPhone 14 Plus : ధర రూ. 79,900, తగ్గింపుతో ఇప్పుడు రూ. 75,900.
* iPhone 13 : ధర రూ. 59,900, తగ్గింపుతో ఇప్పుడు రూ. 56,900.
* iPhone SE : ధర రూ. 49,900, తగ్గింపుతో ఇప్పుడు రూ. 47,990.
* Apple Watch Series 9 : ధర రూ. 41,900, తగ్గింపుతో రూ. 39,400.
* Apple Watch Ultra 2 : ధర రూ. 89,900, తగ్గింపుతో ఇప్పుడు రూ. 86,900.
* Apple Watch SE : ధర రూ. 29,900, తగ్గింపుతో ఇప్పుడు రూ. 28,400.
ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు, ఐప్యాడ్లు, మ్యాక్‌బుక్స్ మరిన్నింటితో సహా వివిధ ప్రొడక్టులపై ఆపిల్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఐప్యాడ్ ప్రో మోడల్‌లు, ఐప్యాడ్ ఎయిర్, వివిధ ఐప్యాడ్ వెర్షన్లపై రూ. 4వేల వరకు తగ్గింపు పొందవచ్చు. MacBook Air M2 చిప్, 13-అంగుళాల, 14-అంగుళాల, 16-అంగుళాల సైజులలో MacBook Pro, Mac Studio, MacBook Air M1 చిప్, iMac 24-అంగుళాలు, Mac మినీ వంటి మ్యాక్‌బుక్ మోడల్‌లు రూ. 8వేల వరకు డిస్కౌంట్ కలిగి ఉన్నాయి. 3 నెలలు, 6 నెలల పాటు నో-కాస్ట్ EMI ప్లాన్లను కూడా పొందవచ్చు. కొత్త ఆపిల్ డివైజ్‌లో క్రెడిట్ పొందే కస్టమర్లు తమ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు సౌకర్యవంతమైన డెలివరీ, పికప్ ఆప్షన్లు ఉన్నాయి.