iPhone 16 Price Cut : వారెవ్వా.. భలే డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యా..!
iPhone 16 Price Cut : ఐఫోన్ 16 కొనేందుకు అద్భుతమైన అవకాశం. క్రోమాలో ఐఫోన్ 16 ధర ధర తగ్గింది. బ్యాంక్ ఆఫర్లతో రూ. 63,990కు కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 16 Price Cut : ఆపిల్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 16పై భారీ తగ్గింపు పొందవచ్చు. కొత్త ఆపిల్ ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే బెటర్ టైమ్.. ప్రస్తుతం ఐఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. క్రోమాలో ఐఫోన్ ధర తగ్గింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై అనేక డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ ఆఫర్లతో ఐఫోన్ 16 క్రోమాలో రూ.63,990కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్‌పై మొత్తం రూ.5,910 తక్కువకు కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్ : క్రోమాలో ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పాటు అనేక ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రస్తుతం క్రోమాలో ఐఫోన్ 16 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 69,900 ఉండగా క్రోమాలో ధర రూ. 66,990కి తగ్గింది.

అదనంగా, ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డ్ పేమెంట్లపై మరో రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా ఆపిల్ ఐఫోన్ 16పై రూ. 63,990 తగ్గింపు అందిస్తోంది. ఐఫోన్ కొనుగోలుపై దాదాపు రూ.6వేలు సేవ్ చేసుకోవచ్చు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోల్చి చూస్తే.. అమెజాన్‌లో ఐఫోన్ 16 స్టాక్ అయిపోయింది. ఈ ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో పూర్తి ధరకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం క్రోమాలో మాత్రమే ఐఫోన్ 16పై అద్భుతమైన డీల్ లభిస్తోంది.

ఆపిల్ ఐఫోన్ 16 అనేక కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 16లో A18 చిప్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ బ్యాక్ సైడ్ 48MP మెయిన్ కెమెరా, 12MP సెకండరీ సెన్సార్ అందిస్తుంది.

సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఐఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంది. ఈ ఐఫోన్ 25W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP68 రేటింగ్ కలిగి ఉంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఐఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.
