Apple iPhone 16 : కొంటే ఐఫోన్ కొనాల్సిందే.. ఈ ఐఫోన్ 16పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు
Apple iPhone 16 : ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే.. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. డోంట్ మిస్..
Apple iPhone 16
Apple iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? వచ్చే ఏడాది నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదైనవిగా మారనున్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ఆపిల్ ఐఫోన్ 16 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. క్రిస్మస్, కొత్త ఏడాదికి ముందు ఈ సెలవు సీజన్‌లో ఆపిల్ ఐఫోన్ 16 భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది.
దేశీయ మార్కెట్లో రూ. 79,900 ధరకు లాంచ్ అయిన ఈ ఐఫోన్ మోడల్ దాదాపు రూ. 63వేల ధరకు కొనేసుకోవచ్చు. ఐఫోన్ 15తో పోలిస్తే ఈ డివైజ్ కెమెరా, పర్ఫార్మెన్స్, డిజైన్ ఇతర ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ధర డీల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ధర ఎంతంటే? :
ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16 రూ.66,900 వద్ద లిస్ట్ అయింది. లాంచ్ ధర నుంచి రూ.13,000 ధర తగ్గింపుతో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ధరను రూ.4వేలకు తగ్గించవచ్చు. నికర ధర దాదాపు రూ.62,900కి తగ్గుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ.2,927 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. కానీ, మీరు ఫైల్ ఛార్జీలు, వడ్డీల కోసం కొంత అదనపు మొత్తాన్ని చెల్లించాలి.
ఇంకా, కస్టమర్లు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వర్కింగ్ కండిషన్ బ్రాండ్ మోడల్ ఆధారంగా బెస్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు అదనపు చెల్లించి ఫోన్‌తో పాటు ఆపిల్ కేర్ ప్లస్ కూడా ఎంచుకోవచ్చు.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌ను అందిస్తుంది. ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది 8GB ర్యామ్ కలిగి ఉంటుంది. ఈ ఐఫోన్ లేటెస్ట్ iOS26 అప్‌డేట్‌పై రన్ అవుతుంది. 3,561mAh బ్యాటరీ కలిగి ఉంది. ఐఫోన్ 15 తో పోలిస్తే అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. 25W మ్యాగ్ సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ ఐఫోన్ సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 48MP ప్రైమరీ షూటర్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఐఫోన్ 12MP సెల్ఫీ కెమెరాను అందిస్తుంది.
