Apple iPhone 16 Pro : ఆపిల్ లవర్స్ మీకోసమే.. ఈ ఐఫోన్ 16 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ ఇప్పట్లో రాదు..!

Apple iPhone 16 Pro : ఈ ప్లాట్‌ఫామ్‌పై ఆపిల్ ఐఫోన్ 16 ప్రో రూ.14,900 భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 Pro : ఆపిల్ లవర్స్ మీకోసమే.. ఈ ఐఫోన్ 16 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ ఇప్పట్లో రాదు..!

Apple iPhone 16 Pro

Updated On : November 16, 2025 / 4:30 PM IST

Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు అద్భుతమైన ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. గత ఏడాదిలో లాంచ్ అయినా ఇప్పటికీ మార్కెట్లో ఫుల్ డిమాండ్ కలిగి ఉంది. ఇటీవలి స్మార్ట్‌ఫోన్‌లలో టాప్ ఆప్షన్లలో నిలిచింది. ఈ ఐఫోన్ 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే, ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్, ట్రిపుల్ రియర్ కెమెరాలు, 3852mAh బ్యాటరీని కలిగి ఉంది.

అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఫొటోగ్రఫీని (Apple iPhone 16 Pro) అందిస్తుంది. ఐఫోన్ 16 ప్రోని కొనుగోలు చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైమ్. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ ఈ ఐఫోన్ కొనుగోలుపై కొన్ని బెస్ట్ డిస్కౌంట్లను అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌లతో మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 16 ప్రో ఆఫర్‌ అసలు మిస్ చేసుకోవద్దు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో డీల్ :
భారత మార్కెట్లో రూ.1,09,900 ధరకు లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 8GB ర్యామ్ వేరియంట్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.99,999కే అందుబాటులో ఉంది. ఇంకా, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగిన యూజర్లందరూ రూ.4వేల వరకు భారీ తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఈ ఐఫోన్ 16 ప్రో ధర రూ.95,999కి తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నేచురల్ టైటానియం, డెసర్ట్ టైటానియం, బ్లాక్ టైటానియం అనే 3 విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Oppo Find X9 Series : ఒప్పో ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 18నే ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్ 6.3-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌పై ఆపిల్ 6-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో రన్ అవుతుంది. ఈ ఐఫోన్ iOS18 ఆధారంగా రూపొందింది. లేటెస్ట్ వెర్షన్ iOS 26.1కి అప్‌గ్రేడ్ చేయవచ్చు.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ కలిగి ఉంది. అలాగే, 12MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం OISతో 12MP ఫ్రంట్ స్నాపర్‌ కూడా ఉంది. 3852mAh బ్యాటరీతో పాటు 25W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రన్ అవుతుంది.