Apple iPhone 16 Pro Max (Image Credit to Original Source)
Apple iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. గత ఏడాదిలో కుపెర్టినో ఆధారిత దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది.
ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్, అద్భుతమైన ట్రిపుల్ రియర్ కెమెరా (Apple iPhone 16 Pro Max) సిస్టమ్‌తో వస్తుంది. అయితే, చాలా కాలంగా ఈ ఫోన్ కోసం చూస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఐఫోన్ డివైజ్, ధర డీల్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర తగ్గింపు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 8GB ర్యామ్ వేరియంట్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,14,999కే లభిస్తుంది. అసలు ధర రూ.1,34,999కు పొందవచ్చు. 14 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు.
అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగిన వారందరూ ఐఫోన్‌పై రూ.4వేల వరకు అదనపు ధర తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఐఫోన్ ధర రూ.1,10,999కి తగ్గుతుంది. ప్రస్తుతానికి సింగిల్ కలర్ వేరియంట్ బ్లాక్ టైటానియం కలిగి ఉంది.
Apple iPhone 16 Pro Max (Image Credit to Original Source)
Read Also : Samsung Galaxy A55 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే, ఈ శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ అతి తక్కువ ధరకే, డోంట్ మిస్
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో అందిస్తుంది. ఆపిల్ 6-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ iOS18తో ఆపరేట్ చేస్తుంది. లిక్విడ్ గ్లాస్ థీమ్ ఆధారంగా iOS26.2కి అప్‌గ్రేడ్ చేయవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5X జూమ్‌తో 12MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. 4685mAh బ్యాటరీతో పాటు 25W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.