Apple iPhone 16 Pro Max
Apple iPhone 16 Pro Max : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. అయితే, బ్లాక్ లేదా ప్లస్ సభ్యులైతే 24 గంటల ముందస్తు యాక్సెస్‌తో పొందవచ్చు. ఈ వార్షిక సేల్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మరిన్నింటితో సహా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
మీరు కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే అతి తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఇంటికి తెచ్చుకోవచ్చు. అర్హత కలిగిన (Apple iPhone 16 Pro Max) కొనుగోలుదారులు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 69,999 కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 16 ప్రోపై ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.89,999కి తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే.. అదనంగా రూ.5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 13 మాదిరిగా పాత మోడల్ ఉంటే.. రూ. 20వేల కన్నా ఎక్కువ ట్రేడ్-ఇన్ వాల్యూను పొందవచ్చు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ. 49,999 కన్నా తక్కువకు పొందవచ్చు. ఫైనల్ వాల్యూ పాత స్మార్ట్‌ఫోన్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే :
6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే.
120Hz ప్రోమోషన్ టెక్నాలజీ
ప్రాసెసర్ :
A18 ప్రో చిప్
ఆపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్లు
కెమెరా సిస్టమ్ :
మెయిన్ కెమెరా : 48MPతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)
అల్ట్రావైడ్ లెన్స్ : 48MP కెమెరాలు
టెలిఫోటో లెన్స్ : 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP పెరిస్కోప్ లెన్స్.
ఫ్రంట్ కెమెరా : 12MP ట్రూడెప్త్ కెమెరా.
కొత్త ఫీచర్ : షార్ట్‌కట్ ద్వారా షూటింగ్ మోడ్స్, స్పెషల్ కెమెరా కంట్రోల్ బటన్
డిజైన్ :
తేలికైన టైటానియం డిజైన్ కలిగి ఉంది. కొత్త జనరేషన్ సిరామిక్ షీల్డ్ మెటీరియల్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇతర స్మార్ట్‌ఫోన్ గ్లాస్ కన్నా 2 రెట్లు బలంగా ఉంటుంది.
స్టోరేజీ ఆప్షన్లు :
3 ఇంటర్నల్ మెమరీ 256GB, 512GB, 1TB వేరియంట్లు