Apple iPhone 16 Pro : ఆఫర్ అదిరింది భయ్యా.. ఐఫోన్ 16 ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే మీ సొంతం..!
Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ధర తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు.. ఏకంగా రూ. 15,900కిపైగా తగ్గింపు పొందింది.

Apple iPhone 16 Pro : ఆపిల్ ఫ్యాన్స్ తప్పక కొనాల్సిన ఐఫోన్.. తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం క్రోమాలో ఐఫోన్ 16 ప్రో రూ. 15,900 కన్నా భారీ తగ్గింపుతో లభిస్తోంది. పూర్తి లాంచ్ ధర చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆపిల్ హై-ఎండ్ ఫోన్ సొంతం చేసుకోవాలంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. అందులోనూ ఇలాంటి డిస్కౌంట్ డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీకు ఆసక్తి ఉంటే ఇప్పుడే ఐఫోన్ 16 ప్రో కొనేసుకోండి. ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్, A18 ప్రో చిప్, 6.3-అంగుళాల డిస్‌ప్లే సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో డిస్కౌంట్ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో రూ.1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. క్రోమా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హై-ఎండ్ ఫోన్ ప్రస్తుతం రూ.1,03,990కి లిస్ట్ అయింది. నేరుగా ధర రూ.15,910 తగ్గింపు పొందవచ్చు.

ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్ 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇంకా, స్క్రీన్ HDR10 డాల్బీ విజన్ సపోర్టుతో వస్తుంది. ఐఫోన్ 16 ప్రో ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఐఫోన్ 16 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డివైజ్ ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కలిగి ఉంది. ఇంకా, ఐఫోన్ 16 ప్రో 25W వైర్డు, 15W వైర్‌లెస్, 4.5W రివర్స్ వైర్డు సపోర్ట్‌తో 3582mAh బ్యాటరీని కలిగి ఉంది.
