Apple iPhone 17 Leak : ఆపిల్ ఐఫోన్ 17 ఫీచర్లు లీక్.. బిగ్ డిస్‌ప్లే, మరెన్నో అప్‌గ్రేడ్ ఆప్షన్లు ఉండొచ్చు..!

Apple iPhone 17 Leak : ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌ను సెప్టెంబర్ 2025లో అధికారికంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది, ఆపిల్ ఒక కొత్త మోడల్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఆ కొత్త ఐఫోన్ "iPhone 17 Air" పేరుతో రానుంది.

Apple iPhone 17 leaks, tipped to get big upgrade in display

Apple iPhone 17 Leak : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఐఫోన్ 16 సిరీస్ ఇటీవలే లాంచ్ అయింది. అయితే, వచ్చే ఏడాది ఐఫోన్ 17 కూడా ప్రవేశపెట్టేందుకు ఆపిల్ సన్నద్ధమవుతోంది. ఐఫోన్ 17 భారీ డిస్‌ప్లే అప్‌గ్రేడ్‌తో వస్తుందని ముందస్తు లీక్‌లు సూచిస్తున్నాయి.

Read Also : Maruti Suzuki WagonR : కొత్త కారు భలే ఉందిగా.. సుజుకి వ్యాగన్ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్ అదిరింది.. ధర ఎంతంటే?

నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రోమోషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీని అర్థం 120Hz డిస్‌ప్లే అని చెప్పవచ్చు. ఈ ఫీచర్ గత ప్రో మోడల్‌లలో రిజర్వ్ అయింది. ఇప్పుడు ప్రామాణిక మోడల్‌లకు అలాగే సున్నితమైన స్క్రోలింగ్, వీడియో ప్లేబ్యాక్ ఎక్స్‌పీరియన్స్ అందించనున్నట్టు పుకార్లు వచ్చాయని మ్యాక్‌రుమర్స్ నివేదించింది.

ప్రస్తుతం 60Hz రిఫ్రెష్ రేట్‌తో ప్రామాణిక ఐఫోన్ మోడల్‌లకు పెద్ద అప్‌గ్రేడ్‌ని సూచిస్తుంది. ఐఫోన్ ప్రో మోడల్స్‌లో ఆన్‌లో ఉండే ఫీచర్ మాదిరిగానే డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే అప్‌గ్రేడ్ ఐఫోన్ 16 సిరీస్‌తో కూడా వస్తుంది. లేదంటే.. ఐఫోన్ 17లో ఈ ఫీచర్‌ను పొందాలంటే కొనుగోలుదారులు 2025 వరకు వేచి ఉండవచ్చు. ఐఫోన్ 16 ప్రో పెద్ద 6.3-అంగుళాలు, 6.9-అంగుళాల డిస్‌ప్లేతో రానుంది.

ఐఫోన్ 17 10Hz లేదా 1Hz లో-ఎండ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందా అనేది అస్పష్టంగా ఉంది. ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌ను సెప్టెంబర్ 2025లో అధికారికంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది, ఆపిల్ ఒక కొత్త మోడల్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఆ కొత్త ఐఫోన్ “iPhone 17 Air” పేరుతో రానుంది.

ఈ ఐఫోన్ సన్నగా ఉంటుందని 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుందని నివేదించింది. ఈ ఫోన్ ప్లస్ సిరీస్‌కు ప్రత్యామ్నాయంగా రానుంది. వచ్చే ఏడాది ఐఫోన్ 17 ప్లస్ మోడల్‌ను చూడకపోవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ ఆపిల్ నుంచి వచ్చిన చివరి ప్లస్ మోడల్ కావచ్చు.

Read Also : Phone Internet Speed : మీ ఫోన్‌లో ఇంటర్నెట్ రావడం లేదా? నెట్‌వర్క్ స్పీడ్ కోసం ఈ 5 సింపుల్ టిప్స్ ట్రై చేయండి!