Tech Tips : మీ ఫోన్‌లో ఇంటర్నెట్ రావడం లేదా? నెట్‌వర్క్ స్పీడ్ కోసం ఈ 5 సింపుల్ టిప్స్ ట్రై చేయండి!

Tech Tips in Telugu : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇంటర్నెట్ డేటా పనిచేయడం లేదా? రోజువారీ డేటా లిమిట్ ఉన్నట్లయితే.. మీ ఫోన్‌లో ఇంటర్నెట్ తిరిగి పొందవచ్చు. ఈ 5 సింపుల్ టిప్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు నెట్‌వర్క్ స్పీడ్ పెంచుకోవచ్చు.

Tech Tips : మీ ఫోన్‌లో ఇంటర్నెట్ రావడం లేదా? నెట్‌వర్క్ స్పీడ్ కోసం ఈ 5 సింపుల్ టిప్స్ ట్రై చేయండి!

No Internet on Android mobile ( Image Credit : Google )

Tech Tips in Telugu : మీ ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీతో సమస్య ఉందా? మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదనే మెసేజ్ కనిపిస్తోందా? ఆందోళన చెందకండి. ప్రత్యేకించి ఇంటర్నెట్ అవసరమైన సమయాల్లో ఇలాంటి సమస్య ఎదురైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే, ముందుగా మీ డేటా ప్లాన్‌కు ముగిసిందా లేదా కనెక్టివిటీలో ఏదైనా సమస్య ఉందా అని చెక్ చేయండి. ఇప్పటికీ రోజువారీ డేటా లిమిట్ ఉన్నట్లయితే.. మీ ఫోన్‌లో ఇంటర్నెట్ తిరిగి పొందవచ్చు. ఈ 5 సింపుల్ టిప్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు నెట్‌వర్క్ స్పీడ్ పెంచుకోవచ్చు. అవేంటో ఓసారి లుక్కేయండి.

Read Also : Motorola Razr 50 Ultra : మోటోరోలా నుంచి మడతబెట్టే ఫోన్.. రెజర్ 50 అల్ట్రా ధర, స్పెసిఫికేషన్‌లు లీక్!

మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి :
మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం వల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలతో సహా అనేక రకాల టెక్నికల్ సమస్యలను ఫిక్స్ చేయొచ్చు. మీ ఫోన్ పవర్ డౌన్ చేయండి. కొంతసేపు అలానే ఉంచి ఆపై దాన్ని మళ్లీ ఆన్ చేయండి. ఏవైనా తాత్కాలిక అవాంతరాలు ఉంటే ఫిక్స్ అవుతాయి. అంతేకాదు.. నెట్‌వర్క్‌ కనెక్షన్‌ని రిఫ్రెష్ చేస్తుంది. మీ ఫోన్‌ని రీబూట్ చేయకూడదనుకుంటే.. మీ నెట్‌వర్క్ కనెక్టివిటీని రీస్టార్ట్ చేయడానికి ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ లేదా ఆఫ్ కూడా టోగుల్ చేయవచ్చు.

మీ ఫోన్, యాప్‌లను అప్‌డేట్ చేయండి :
మీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తుండాలి. లేదంటే.. నెట్‌వర్క్ స్పీడ్ సమస్యలతో సహా పర్పార్మెన్స్ సమస్యలు ఉండవచ్చు. మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయడం వల్ల లేటెస్ట్ బగ్ పరిష్కారాలు, ఆప్టిమైజేషన్‌లను పొందవచ్చు. తద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచుతాయి. సెట్టింగ్‌ల మెనులో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల కోసం చెక్ చేయాలి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ వెర్షన్‌ను రన్ చేస్తుండాలి.

Settings > System Update ఆప్షన్‌కు వెళ్లండి. అప్‌డేట్స్ కోసం చెక్ చేయండి. అందుబాటులో ఉన్న ఏవైనా అప్‌డేట్స్ ఉంటే డౌన్‌లోడ్ చేయండి. అదనంగా, మీ యాప్‌లు మీ ప్రస్తుత ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్టు చేసేలా ఉండాలి. అందుకోసం లేటెస్ట్ వెర్షన్‌లకు వెంటనే అప్‌డేట్ చేయండి.

యాప్ కాష్‌ని క్లియర్ చేయండి.. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి :
పీసీలు, ల్యాప్‌టాప్‌లలో మాదిరిగానే యాప్‌లు, ఆండ్రాయిడ్ సిస్టమ్ నుంచి ఫోన్‌లలో కాష్ (Cache) చేసిన డేటా స్టోర్ అవుతుంది. ఇది.. మీ ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించగలదు. మీ వెబ్ బ్రౌజర్, తరచుగా ఉపయోగించే యాప్‌ల కాష్‌ని క్రమం తప్పకుండా క్లియర్ చేస్తుండాలి. అదనంగా, బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్‌లు తెరిచి ఉండటం లేదా మీ బ్రౌజర్‌లో చాలా వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసి ఉంటే.. వెంటనే క్లోజ్ చేయండి.

డేటా వినియోగం, బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను చెక్ చేయండి :
అధిక డేటా వినియోగం లేదా బ్యాక్‌గ్రౌండ్ యాప్‌ల కారణంగా మీ నెట్‌వర్క్ స్పీడ్ తగ్గించగలవు. ఏదైనా నిర్దిష్ట యాప్ సాధారణం కన్నా ఎక్కువ డేటాను వినియోగిస్తోందో లేదో చూసేందుకు సెట్టింగ్స్ మెనులో మీ డేటా వినియోగాన్ని చెక్ చేయండి. సెట్టింగ్‌లలో నిర్దిష్ట యాప్‌ల కోసం బ్యాక్‌గ్రౌండ్ డేటా వినియోగాన్ని కూడా పరిమితం చేయవచ్చు. మీరు అవసరమైన యాప్‌ల కోసం నెట్‌వర్క్ స్పీడ్ పెంచుకోవచ్చు.

మీ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయండి :
ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారా? మీ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయక తప్పదు. అన్ని నెట్‌వర్క్ సెట్టింగ్‌లను డిఫాల్ట్ కాన్ఫిగరేషన్‌‌కు మారాలి. సెట్టింగ్‌లను రీసెట్ చేయడానికి, మీ సెట్టింగ్‌ల మెనుకి వెళ్లాలి. ‘System’ సెక్షన్‌కు నావిగేట్ చేయండి. ఆ తర్వాత ‘Reset’ ఎంచుకోండి. ఆపై ‘Reset network settings’ ఎంచుకోండి. అయితే నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేస్తే సేవ్ చేసిన వై-ఫై నెట్‌వర్క్‌లు, బ్లూటూత్ కనెక్షన్‌లు కూడా రిమూవ్ అవుతాయి. ఆ తర్వాత మళ్లీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.

Read Also : iPhone 16 Pro Display : ఆపిల్ ఐఫోన్ 15 ప్రోతో పోలిస్తే.. రాబోయే ఐఫోన్ 16 ప్రోలో 20శాతం బ్రైట్‌నెస్ డిస్‌ప్లే.. కొత్త క్యాప్చర్ బటన్..!