Maruti Suzuki WagonR : కొత్త కారు భలే ఉందిగా.. సుజుకి వ్యాగన్ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్ అదిరింది.. ధర ఎంతంటే?
Maruti Suzuki WagonR Waltz : ఈ వాహనంలో రెండు కె-సిరీస్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటీ విత్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ISS) టెక్నాలజీని కలిగి ఉంది.

Maruti Suzuki WagonR Waltz limited edition launched
Maruti Suzuki WagonR Waltz : కొత్త కారు కొంటున్నారా? ప్రముఖ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా వ్యాగన్ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త కారును రూ. 5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అంతేకాదు.. ఈ వ్యాగన్ఆర్ వాల్ట్స్ మోడల్ LXi, VXi, Xi వేరియంట్లలో పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో మారుతి అత్యధికంగా అమ్ముడైన కార్లలో వ్యాగన్ఆర్ ఒకటి. 1999లో ప్రారంభించినప్పటి నుంచి 3,250,000 యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించింది. ప్రస్తుతం, మిడ్-హ్యాచ్‌బ్యాక్ విభాగంలో 64శాతం కన్నా ఎక్కువ వాటాను కలిగి ఉంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ వాల్ట్జ్ లిమిటెడ్ ఎడిషన్ ఫాగ్ ల్యాంప్స్, వీల్-ఆర్చ్ క్లాడింగ్, బంపర్ ప్రొటెక్టర్లు, సైడ్ స్కర్ట్స్, బాడీ సైడ్ మోల్డింగ్, ఫ్రంట్ క్రోమ్ గ్రిల్ వంటి అనేక ఎక్స్‌టీరియర్ ఫీచర్లతోవస్తుంది. కొత్త ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి.
అదనంగా, కారు టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరాను కలిగి ఉంది. సెక్యూరిటీ ఫీచర్లలలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-హోల్డ్‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉన్నాయి. మొత్తంమీద, 12 కన్నా ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఈ వాహనంలో రెండు కె-సిరీస్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటీ విత్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ISS) టెక్నాలజీని కలిగి ఉంది. రెండు యూనిట్లు పెట్రోల్‌లో ఎంటీ, ఎఎంటీ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. 1.0-లీటర్ పెట్రోల్ యూనిట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో సీఎన్‌జీ ఆప్షన్ పొందుతుంది.
వ్యాగన్ఆర్ వాల్ట్జ్ పెట్రోల్ 25.19kmpl మైలేజీని కలిగి ఉంది. వ్యాగన్ఆర్ వాల్ట్జ్ సీఎన్‌జీ 33.48km ప్యాకేజీ, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 2012 నాటికి మొదటి 1 మిలియన్ అమ్మకాల 2017 నాటికి 2 మిలియన్లను సాధించింది. 2023లో 3 మిలియన్ల అమ్మకాలను చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో మిడ్-హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వ్యాగన్ఆర్ 61శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి 64శాతానికి పెరిగింది.