Apple iPhone 17 : ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఐఫోన్ 17 సిరీస్ వచ్చేది ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!

Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో ఎప్పుడైనా ఈ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కావచ్చు.

Apple iPhone 17

Apple iPhone 17 : ఆపిల్ అభిమానులకు పండగే.. అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. ఈ ఏడాది చివరిలో ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. లీక్‌ల ప్రకారం.. ఈ ఏడాదిలో లైనప్ కొత్తగా ఉంటుందని సూచిస్తున్నాయి.

Read Also : Samsung Galaxy A35 5G : శాంసంగ్ గెలాక్సీ A35 5Gపై కిర్రాక్ డిస్కౌంట్లు.. తక్కువ ధరకే వస్తుంటే కొనకుండా ఉండలేరు!

నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 అల్ట్రా ఉండవచ్చు. ఐఫోన్ 17 సిరీస్ కు సంబంధించి కొన్ని కీలక అప్‌డేట్స్ కూడా లీక్‌ అయ్యాయి.

లేటెస్ట్ లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, కచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు.

వచ్చే ఏడాది నుంచి ఆపిల్ ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో మోడళ్ల ప్రత్యేక లాంచ్‌లపై కూడా లీక్‌లు సూచిస్తున్నాయి. ఐఫోన్ 17 సిరీస్ గురించి ఇప్పటివరకూ తెలిసిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డిజైన్ :
ఆపిల్ ఐఫోన్ 17 గత మోడల్ మాదిరిగానే డిజైన్‌ ఉండొచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ అల్ట్రా-థిన్ మాదిరిగా ఉంటుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్ ఉండొచ్చు.

ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 అల్ట్రా రెండూ భారీ డిజైన్ ఓవర్‌హాల్‌ కలిగి ఉండొచ్చు. ఫ్లాష్, లిడార్‌ను రైట్ సైడ్ మార్పుతో  కొత్త కెమెరా బంప్ ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ స్మాల్ డైనమిక్ ఐలాండ్‌ ఉండవచ్చు. టైటానియం ఫ్రేమ్‌ను అల్యూమినియం ఫ్రేమ్‌కు మార్చవచ్చు.

పర్ఫార్మెన్స్, కెమెరాలు :
ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌ మోడల్స్ A19 చిప్ ద్వారా పవర్ అందిస్తాయి. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 అల్ట్రాలు A19 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ అందించే అవకాశం ఉంది.

ఐఫోన్ 17 సిరీస్‌లో 24MP ఫ్రంట్ కెమెరాలు ఉండొచ్చు. బ్యాక్ కెమెరా సెటప్ కూడా అలాగే ఉండొచ్చు. ఐఫోన్ ప్రో, అల్ట్రా మోడళ్లలో 5x టెలిఫోటో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

డిస్‌ప్లే (అంచనా) :
నివేదికల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ 6.3-అంగుళాల ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ 17 ఎయిర్ 6.6-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

ఐఫోన్ 17 ప్రో 6.3-అంగుళాల డిస్‌ప్లే కూడా ఉండవచ్చు. ఐఫోన్ ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్‌ ఉండవచ్చు. నివేదికల ప్రకారం.. ఈ ఐఫోన్ 120Hz వద్ద సూపర్ రెటినా ప్యానెల్‌ను కలిగి ఉండొచ్చు.

ఐఫోన్ 17 సిరీస్ ధర (అంచనా) :
ఐఫోన్ 17 (బేస్ వేరియంట్) ధర రూ.89,900 ఉండవచ్చని అంచనా. ఐఫోన్ 17 ఎయిర్ ధర రూ.99,900 ఉండొచ్చు. ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,29,900 ఉండవచ్చు.

Read Also : Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లు కూడా..!

ఐఫోన్ 17 అల్ట్రా ధర రూ.1,64,990 ఉండవచ్చని పుకార్లు సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి లీక్ ధరలు మాత్రమే.. అధికారిక ధరలు వచ్చేవరకు ఆగాల్సిందే.