Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లు కూడా..!
Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ ఎండ్ సీజన్ సేల్ సమయంలో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Motorola Edge 50 Fusion
Motorola Edge 50 Fusion : మోటోరోలా అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ సీజన్ సేల్ సందర్భంగా మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ఈ మోటోరోలా ఫోన్ అనేక డిస్కౌంట్లు, ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. తక్కువ బడ్జెట్ ధరలో సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో 26 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Vivo T3 Ultra 5G : ఆఫర్ అదుర్స్.. అమెజాన్‌లో అతి చౌకైన ధరకే వివో T3 అల్ట్రా ఫోన్.. సూపర్ డీల్..!
డిస్కౌంట్, ఈఎంఐ ఆఫర్లు (Motorola Edge 50 Fusion) :
8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి 26 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ తర్వాత రూ. 18,999 ధరకు పొందవచ్చు. ఈ ఫోన్ ధరను బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.
బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. Axis, ICICI, HDFC బ్యాంక్ కార్డులపై రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. రూ. 18,200 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌తో రూ. 3167 నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు :
ఈ మోటో ఫోన్ (Motorola Edge 50 Fusion) 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 120hz సపోర్ట్‌తో వస్తుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ప్రాసెసర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 2 ప్రాసెస్ అందిస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్‌ప్లే ప్రొటెక్షన్‌తో వస్తుంది.
కెమెరా సెటప్, బ్యాటరీ లైఫ్ :
ఫోటోలు, వీడియోల కోసం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 50MP, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ IP68 రెసిస్టెన్స్ సపోర్ట్‌తో వస్తుంది.