Apple MacBook Air M4 : కొత్త ఆపిల్ మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్ భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఆపిల్ ఇటీవలే మ్యాక్‌బుక్ ఎయిర్ M4 లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ మ్యాక్‌బుక్ ధర తగ్గింపు పొందింది. ఆపిల్ మ్యాక్‌బుక్ కొనేందుకు చూస్తున్న అద్భుతమైన అవకాశం. ఈ మ్యాక్ ల్యాప్‌టాప్‌పై డిస్కౌంట్ విజయ్ సేల్స్‌లో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ డిస్కౌంట్ ఎలా పొందాలి? స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఓసారి లుక్కేద్దాం..
2/6
విజయ్ సేల్స్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై బిగ్ డిస్కౌంట్ : ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 మోడల్ స్కై బ్లూ కలర్‌లో 256GB SSDతో 16GB ర్యామ్ వేరియంట్ కలిగి ఉంది. విజయ్ సేల్స్‌లో ఈ మ్యాక్‌బుక్ అసలు ధర రూ. 99,900 నుంచి రూ. 92,400కు అందుబాటులో ఉంది. అంటే.. నేరుగా రూ. 7,500 తగ్గింపు పొందవచ్చు.
3/6
అదనంగా, ఐసీఐసీఐ లేదా ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ ల్యాప్‌టాప్‌పై అదనంగా రూ. 10వేలు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ. 82,400కు తగ్గుతుంది. ఎంపిక చేసిన కలర్ ఆప్షన్లపై డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
4/6
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ మ్యాక్‌బుక్ M4 సూపర్ ఇమ్మర్సివ్ 13.6-అంగుళాల డిస్‌ప్లేతో పాటు 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ డెస్క్ వ్యూ సపోర్ట్‌తో 12MP ఫేస్‌టైమ్ HD సెంటర్ స్టేజ్ సెన్సార్ ఉంటుంది. ఈ పరికరం 10-కోర్ CPUతో పాటు సెకనుకు 120GB మెమరీ బ్యాండ్‌విడ్త్‌ను అందించే తాజా M4 ప్రాసెసర్‌తో వస్తుంది.
5/6
కనెక్టివిటీ విషయానికొస్తే.. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్, మాగ్‌సేఫ్ 3 ఛార్జింగ్ పోర్ట్, 2 థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, బ్లూటూత్ 5.3, వై-ఫై 6E ఫీచర్లను కలిగి ఉంది. బేస్ మోడల్‌లో 30W ఛార్జర్‌తో 53.8Wh బ్యాటరీతో పవర్ అందిస్తుంది.
6/6
ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 మోడల్ 70W వరకు USB-C ఛార్జర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ల్యాప్‌టాప్ వీడియో స్ట్రీమింగ్ విషయానికి వస్తే 18 గంటలు పనిచేస్తుంది.