Apple MacBook Pro
Apple MacBook Pro : ప్రముఖ కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ లేటెస్ట్ మ్యాక్‌బుక్ ప్రో (14-అంగుళాల M5)ను లాంచ్ చేసింది. కంపెనీ కొత్త ఆపిల్ M5 చిప్‌తో రన్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్ ఏఐ ప్రాసెసింగ్, స్టోరేజీ స్పీడ్, బ్యాటరీ లైఫ్‌లో అప్‌గ్రేడ్స్ అందిస్తుంది.
ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రోగా వస్తుంది. 14-అంగుళాల మోడల్ స్పేస్ బ్లాక్, సిల్వర్ కలర్ (Apple MacBook Pro) ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ సేల్స్ అక్టోబర్ 22, 2025 నుంచి ప్రారంభమవుతాయి. సరికొత్త ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో గురించి పూర్తి వివరాలపై లుక్కేయండి.
ఆపిల్ మ్యాక్‌బుక్ M5 ప్రో స్పెసిఫికేషన్లు :
ఆపిల్ M5 చిప్ గతంలో కన్నా 3.5 రెట్లు స్పీడ్ ఏఐ పర్ఫార్మెన్స్ అందిస్తుందని పేర్కొంది. జీపీయూ స్పీడ్ 1.6 రెట్లు వేగంగా ఉంటుంది. కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ కోసం ఈ మ్యాక్‌బుక్ తయారైంది. ఈ మ్యాక్‌బుక్ 2× SSD స్పీడ్ కూడా కలిగి ఉంది. 4TB వరకు స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లతో వస్తుంది. ఎక్స్‌ట్రనల్ స్టోరేజీపై ఆధారపడకుండా ఫైల్ హ్యాండ్లింగ్, రెండరింగ్, యాప్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఆపిల్ ప్రకారం.. బ్యాటరీ లైఫ్ సింగిల్ ఛార్జ్‌పై 24 గంటలకు పొడిగించినట్లు టెక్ దిగ్గజం పేర్కొంది.
Read Also : Apple iPad Pro : M5 చిప్‌తో ఆపిల్ ఐప్యాడ్ ప్రో ఆగయా.. ఏఐ ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్
ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల లిక్విడ్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఆప్షనల్ నానో-టెక్చర్ గ్లాస్‌తో పాటు 12MP సెంటర్ స్టేజ్ కెమెరా, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కలిగి ఉంది. కొన్ని గత మోడళ్ల మాదిరిగా కాకుండా కొత్త మ్యాక్‌బుక్ ప్రో HDMI, MagSafe, SD కార్డ్ స్లాట్‌తో సహా పూర్తి ఆప్షనల్ పోర్టులను అందిస్తుంది.
ఆపిల్ డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ వెర్షన్ MacOS టాహో(Tahoe)పై రన్ అవుతుంది. ఈ అప్‌డేట్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో స్పాట్‌లైట్ సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్లను అందిస్తుంది. మరిన్ని టాస్కులను క్లౌడ్‌కు బదులుగా డివైజ్ నేరుగా రన్ అయ్యేలా రూపొందాయి.
భారత్‌లో ఆపిల్ మ్యాక్‌బుక్ M5 ప్రో ధర, కలర్ ఆప్షన్లు, లభ్యత :
భారత మార్కెట్లో కొత్త మ్యాక్‌బుక్ ప్రో బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ.1,69,900 నుంచి ప్రారంభమవుతుంది. ఆపిల్ వెబ్‌సైట్, అధీకృత రిటైల్ ఛానెల్‌లలో ప్రీ-ఆర్డర్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ల్యాప్‌టాప్ స్పేస్ బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.