ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ మరో కొత్త బీటా ఫీచర్ ను రిలీజ్ చేసింది. అప్ కమింగ్ ఫీచర్ టీవీఓఎస్ (tvOS)12.3 ఫస్ట్ బీటా అప్ డేట్ ను ప్రవేశపెట్టింది.
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ మరో కొత్త బీటా ఫీచర్ ను రిలీజ్ చేసింది. అప్ కమింగ్ ఫీచర్ టీవీఓఎస్ (tvOS)12.3 ఫస్ట్ బీటా అప్ డేట్ ను ప్రవేశపెట్టింది. ఇటీవలే బీటా డెవలపర్స్ అందించే tvOS 12.2 ఫీచర్ ను ఆపిల్ విడుదల చేసింది. టీవీఓఎస్ 12.3 పబ్లిక్ బీటా ఫీచర్ ఆపిల్ టీవీ సెట్టింగ్స్ యాప్ లో అప్ డేట్ అయింది.
సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ సెక్షన్ లో ని సిస్టమ్ అప్షన్ దగ్గర ఈ పబ్లిక్ డేటా ఫీచర్ ను అప్ డేట్ చేసింది. ఇక్కడ గెట్ పబ్లిక్ డేటా అప్ డేట్స్ పై క్లిక్ చేయగానే ఆపిల్ టీవీ నుంచి బీటా సాఫ్ట్ వేర్ డౌన్ లౌడ్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్ టీవీఓఎస్ 12.3లో ఆపిల్ టీవీ యాప్ ను కూడా అప్ డేట్ చేసింది.
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు
ఒరిజినల్ టీవీ యాప్ వెర్షన్ కంటే కొత్త టీవీ యాప్ వెర్షన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యాప్ తో టీవీ షోలు, స్పోర్ట్స్, న్యూస్ ఇలా అన్నింటిని ఒక దగ్గరే యాక్సస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం Apple tvపై వాచ్ నౌ సెక్షన్ తో పాటు up next ఫీచర్ కూడా కనిపిస్తుంది. కానీ, ఈ కొత్త ఫీచర్ తో అంతకుముందు ఏ వీడియో చూశారో ‘ఫర్ యూ’ ఫీచర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఆపిల్ టీవీ అప్ డేట్ లో న్యూ ఛానళ్లు అనే అప్షన్ కూడా ఉంది. ఈ అప్షన్ ద్వారా థర్డ్ పార్టీ సర్వీసులైన షోటైమ్, స్టార్స్జ్, హెచ్ బీఓ రైట్ ను సబ్ స్ర్కైబ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ యాప్ లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.
Read Also : అకౌంట్ unlock కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
ఐఫోన్, ఐప్యాడ్ లో బీటా వెర్షన్, టీవీ యాప్.. ఆపిల్ టీవీ, ఐఓఎస్ డివైజ్ లకు లింక్ అయి ఉంటుంది. థర్డ్ పార్టీ జనరేషన్ యాప్ లలో కూడా ఆపిల్ టీవీ యాప్ చూడవచ్చు. ఈ యాప్ కు సంబంధించిన కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ ను త్వరలో రిలీజ్ చేసేందుకు ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఆపిల్ కొత్త టీవీ యాప్ వచ్చే మేనెలలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.
Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే