‘ఐఫోన్ 16’కు యమక్రేజ్.. యాపిల్ స్టోర్ల వద్ద ఉదయం నుంచి బారులుతీరిన జనం.. వీడియోలు వైరల్

ఏఐ సాంకేతిక తరహాలో యపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో శక్తివంతంగా ఐఫోన్ 16సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ ఫొన్లు భారత్ లో ఇవ్వాలే విక్రయాలు ప్రారంభమయ్యాయి

iPhone 16

iPhone 16: భారత్ లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారు జామునుంచే ఆపిల్ డివైస్ ప్రియులు ముంబై, ఢిల్లీలో ఉన్న ఆపిల్ స్టోర్ల వద్ద క్యూ కట్టారు. గతేడాది యాపిల్ సంస్థ తన యాపిల్ స్టోర్లను భారతదేశంలో ప్రారంభించింది. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ లో ఐఫోన్ 16, ఐఫోన్ 16ప్లస్, ఐఫోన్16ప్రో, ఐఫోన్ 16మ్యాక్స్ ప్రో అనే నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కొద్దిరోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. అయితే, ఇవాళ భారత్ లోని పలు నగరాల్లోని యాపిల్ స్టోర్స్ లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి.

Also Read : Flipkart Big Billion Days Sale : ఈ నెల 27నే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ. 40వేల లోపు ధరలో స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్..!

ఏఐ సాంకేతిక తరహాలో యపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో శక్తివంతంగా ఐఫోన్ 16సిరీస్ ను సంస్థ రూపొందించింది. ఈ సిరీస్ ఫోన్లు భారత్ లో ఇవ్వాళే విక్రయాలు ప్రారంభం కావడంతో కొనుగోలు చేసేందుకు ముంబై, ఢిల్లీలోని యాపిల్ స్టోర్ల బయట తెల్లవారు జాము నుంచే కొనుగోలుదారులు బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : iPhone 16 Launch Offers : ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ ఆఫర్లు.. ఈ కొత్త ఐఫోన్ మోడల్స్‌ తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలంటే?

ఐఫోన్ 16సిరీస్ ధరల విషయానికి వస్తే..
ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900. 128 జీబీ. 256జీబీ, 512జీబీ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900.
ఐఫోన్ 16ప్రొ ప్రారంభ ధర రూ. 1,19,900.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,44,900.