Apple Watch SE 3
Apple Watch SE 3 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఆపిల్ వాచ్ SE 3 మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. నెక్స్ట్ జనరేషన్ వాచ్ SE3 తీసుకొచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈసారి, కొంచెం బిగ్ స్క్రీన్‌తో ఆపిల్ ప్రవేశపెట్టనుంది.
ఇండస్ట్రీ విశ్లేషకుడు రాస్ యంగ్ ప్రకారం.. ఆపిల్ SE 3 మోడల్ డిస్‌ప్లే మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. 1.6-అంగుళాలు, 1.8-అంగుళాల స్క్రీన్ సైజుల్లో రావచ్చు. ఆపిల్ వాచ్ SE 2లో ప్రస్తుత 1.57-అంగుళాలు, 1.73-అంగుళాల సైజుల్లో ఉండగా, అంతకన్నా కొద్దిగా బిగ్ సైజులో ఉండే అవకాశం ఉంది.
సరసమైన ఆపిల్ వాచ్ :
ఆపిల్ వాచ్ SE లైన్ వినియోగదారుల్లో ఎక్కువగా యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆపిల్ SE 3తో మరింత కాంపాక్ట్ కానీ విజువల్ వైడ్ డిజైన్ అందించనుంది. బెజెల్‌లను తగ్గించే అవకాశం ఉంది. తద్వారా మొత్తం వాచ్ సైజు ఒకేలా ఉండనుంది.
గత వాచ్ SE మోడల్స్ పాత ఫ్లాగ్‌షిప్ వాచ్ డిజైన్ మాదిరిగా ఉన్నాయి. ప్రస్తుత SE సిరీస్ 6 తర్వాత ఇదే డిజైన్ అందిస్తున్నాయి. రాబోయే SE 3 సిరీస్ 7 కూడా 41mm, 45mm కేసింగ్‌లతో పూర్తిగా కొత్త లుక్‌తో రావొచ్చు.
ఆపిల్ వాచ్ కలర్లు, ప్లాస్టిక్ బాడీపై పుకార్లు :
నివేదికల ప్రకారం.. ఆపిల్ SE 3 పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లలో హార్డ్ ప్లాస్టిక్ బాడీతో కూడా రావొచ్చునని సూచిస్తున్నాయి. సరసమైన కలర్‌ఫుల్ వేరబుల్ డివైజ్‌ల కోసం చూస్తున్న యువ వినియోగదారులకు వాచ్ SE లైనప్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. రాబోయే కొత్త అప్‌డేట్ వాచ్ డిస్‌ప్లే 38mm, 42mm-స్టయిల్ డిజైన్, మెరుగైన స్క్రీన్-టు-బాడీ రేషియోతో రావచ్చు.
ఆపిల్ వాచ్ సిరీస్ 11, అల్ట్రా 3 పైప్‌లైన్‌లో
ఆపిల్ వాచ్ SE 3తో పాటు, ఆపిల్ వాచ్ సిరీస్ 11, ఆపిల్ వాచ్ అల్ట్రా 3 వాచ్‌లను ఈ ఏడాది చివరిలో లాంచ్ చేయాలని ఆపిల్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మోడల్‌లు అద్భుతమైన డిజైన్ మార్పులతో తీసుకురాకపోవచ్చు.
కానీ, బ్లడ్ ప్రెజర్ అలర్ట్స్, శాటిలైట్ కనెక్టివిటీ, 5G రెడ్‌క్యాప్ సపోర్టు వంటి మెయిన్ అప్‌గ్రేడ్‌లను అందిస్తాయని భావిస్తున్నారు. ఆపిల్ కూడా రీడిజైన్ హెల్త్ యాప్, AI-ఆధారిత వెల్నెస్ కోచింగ్‌ను డెవలప్ చేస్తోంది. భవిష్యత్తులో హార్ట్ రేటు మానిటరింగ్ కలిగిన ఎయిర్‌పాడ్‌లలో కూడా ఇంటిగ్రేషన్ చేయొచ్చు.