Apple Watch Series 7 : ఆపిల్ వాచ్ సేల్స్.. భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఫీచర్లు కిరాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ స్మార్ట్ వాచ్ (Apple Watch Series) సేల్స్ మొదలయ్యాయి. దసరా పండుగ సందర్భంగా భారత మార్కెట్లో ఆపిల్ వాచ్ 7సిరీస్ అందుబాటులోకి తెచ్చింది.

Apple Watch Series 7 (1)
Apple Watch Series 7 : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ స్మార్ట్ వాచ్ (Apple Watch Series) సేల్స్ మొదలయ్యాయి. దసరా పండుగ సందర్భంగా భారత మార్కెట్లో ఆపిల్ వాచ్ 7సిరీస్ (Apple Watch Series 7) అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021 ఏడాదిలో ‘ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్’ను నిర్వహించింది.‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్లో ఆపిల్ వాచ్ 7సిరీస్‌ను విడుదల చేసింది. దసర పండుగ సందర్భంగా ఈ మోడల్ ఆపిల్ వాచ్‌పై ఆపిల్ సేల్స్ ప్రారంభించింది. ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.
Petrol Rate : తగ్గేదే..లే పరుగులు పెడుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే?
ఆపిల్ వాచ్ సిరీస్ 7 ఫీచర్లలో 41mm అండ్ 45mm సైజ్, రెటీనా డిస్ప్లే, 1.7mm థిన్ బెజెల్స్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. WR50 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, క్వర్టీ కీబోర్డ్‌తో వచ్చింది. 45 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చునని ఆపిల్ పేర్కొంది. USB-C ఛార్జింగ్ కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు. క్వర్టీ కీబోర్డ్ (Qwerty Keyboard) యాపిల్ వాచ్ సిరీస్ 6 మోడల్ మాదిరిగానే అందిస్తుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 7లో బ్లడ్ ఆక్సిజన్ (SpO2), ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ సెన్సార్ల ఆధారంగా హార్ట్ ట్రాకింగ్ పనిచేస్తుంది.
ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఆపిల్ వాచ్ సిరీస్ 7 ప్రారంభ ధర రూ. 41,900కే అందుబాటులోకి ఉండనుంది. 41mm సైజ్ వేరియంట్, అల్యూమినియం కేస్, GPS సెల్యూలర్ వెర్షన్ మోడల్ ధర రూ. 50,900కే అందుబాటులో ఉంది. 45mm వేరియంట్ ధర రూ. 44,900, 45mm సైజ్‌లో GPS ప్లస్ సెల్యులర్ ధర రూ.53,900గా ఉంది. అల్యూమినియం కేస్ ఆప్షన్, స్పోర్ట్స్ బ్యాండ్‌తో స్టైన్ లెస్ స్టీల్ కేస్‌తో ఉన్న వాచ్ ధర రూ.69,900గా ఉంది. మిలనీస్ లూప్ స్ట్రాప్‌తో స్టెయిన్లెస్ స్టీల్ కేస్ ధర రూ. 73,900గా ఉంది.
టైటానియం కేస్‌లో లెదర్ లింక్ స్ట్రాప్‌తో వాచ్ ధర రూ. 83,900కు అందుబాటులో ఉంటుందని ఆపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్ పోర్టల్ వెల్లడించింది. ఇక డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్ల విషయానికి వస్తే.. ఆపిల్ రీసెల్లర్ స్టోర్స్, ఆథరైజ్డ్ డిస్టిబ్యూటర్స్, ఇతర ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లలో ఈ ఆపిల్ వాచ్ సిరీస్7 కొనుగోలపై స్పెషల్ ఆఫర్లు అందిస్తోంది. HDFC డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.3వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. కొన్ని స్టోర్లలో రూ.9వేల వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్‌తో ఆపిల్ వాచ్ కొనుగోలు చేసుకోవచ్చు.
IPL 2021: చెన్నై అరుదైన రికార్డు.. 7 సార్లు.. 3సార్లు కేకేఆర్‌పైనే.. ఆల్ విక్టరీ!