Petrol Rate : తగ్గేదే..లే పరుగులు పెడుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే?

పెట్రోల్ ధరలు వినియోగదారులకు గుదిబండలా మారుతున్నాయి. నిత్యం పెరుగుతూ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. డీజిల్ ధర కూడా పరుగులు పెడుతుంది.

Petrol Rate : తగ్గేదే..లే పరుగులు పెడుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే?

Petrol Rate

Petrol Rate :  పెట్రోల్ ధరలు వినియోగదారులకు గుదిబండలా మారుతున్నాయి. నిత్యం పెరుగుతూ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. డీజిల్ ధర కూడా పరుగులు పెడుతుంది. డీజిల్ ధరల నియంత్రణ లేకపోవడంతో రైతులపై తీవ్ర భారం పడుతుంది. ఇప్పుడిప్పుడే యాంత్రీకరణ వైపు అడుగులేస్తున్న రైతులకు ఫ్యూయల్ ధరలు పెను సవాలుగా మారాయి. డీజిల్ ధరలు పెరుగుతుండటంతో రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. జనవరి నుంచి నేటి వరకు పెట్రోల్ పై రూ.22 డీజిల్ పై రూ.23 వరకు పెరిగింది. ఏడాది కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇంట భారీ మార్పులు జరగడం ఇదే తొలిసారి.. గతంలో ఎప్పుడు కూడా ఒక ఏడాది కాలంలో ఇంతలా ధరలు పెరగలేదు.

చదవండి :  పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రయాణికులు ఉన్న బస్సుకి నిప్పుపెట్టారు

ఇక శనివారం లీటరు పెట్రోల్ పై 35పైసలు పెరగ్గా, డీజిల్ పై 36పైసలు పెరిగింది. గతంలో 10, 20 పైసలు పెరిగేది.. కానీ కొద్దీ రోజులుగా ధరలు పెరుగుదల 30 పైసలకు చేరింది. పెంచిన ప్రతి సారి 30 పైసలకు ఎక్కువగానే పెంచుతున్నారు. ఇక శనివారం పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73కి చేరింది. డీజిల్ ధర 102.80గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.35గా, డీజిల్ ధర 102.33గా ఉంది. ఏపీలో విశాఖపట్టణలో లీటర్ పెట్రోల్ ధర 110.99కి చేరింది. ఇక డీజిల్ రేటు 103.43గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ 112.04, డీజిల్ రూ.104.44గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలో చేర్చాలని చాలా రోజులుగా డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. పెట్రోల్ రేటు రూ.75-80కి దిగొస్తుంది. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్ల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి.

చదవండి : పండుగ రోజు షాక్.. పెరిగిన ఫ్యూయల్ ధరలు