Petrol and Diesel Price : పండుగ రోజు షాక్.. పెరిగిన ఫ్యూయల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగేలా కనిపించడం లేదు. సెప్టెంబర్‌లో స్థిరంగా కొనసాగిన ఫ్యూయల్ ధరలు, అక్టోబర్‌లో క్రమంగా పెరుగుతున్నాయి.

Petrol and Diesel Price : పండుగ రోజు షాక్.. పెరిగిన ఫ్యూయల్ ధరలు

Petrol

Petrol and Diesel Price : పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగేలా కనిపించడం లేదు. సెప్టెంబర్‌లో స్థిరంగా కొనసాగిన ఫ్యూయల్ ధరలు, అక్టోబర్‌లో క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం పెట్రోల్‌పై  35పైసలు పెరిగింది. ఫ్యూయల్ ధరల పెరుగుదల నిత్యావసర వస్తువులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరో వైపు గ్యాస్ ధరలు కూడా అడ్డుఅదుపు లేకుండా పెరుగుతుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2021లో ఇప్పటి వరకు పెట్రోల్ పై లీటర్‌కి 21.70 రూ.డీజిల్‌పై 20.70 పెరిగింది.

చదవండి :  హడలెత్తిస్తున్న పెట్రో ధరలు, హైదరాబాద్‌లో లీటర్ రూ. 109

శుక్రవారం వివిధ నగరాల్లోని పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌పై 35పైసలు పెరిగి రూ.105.14కు చేరుకోగా డీజిల్‌పై 35పైసలు పెరిగి రూ.93.87కి చేరుకుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 34పైసలు పెరిగింది.. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.09కి చేరింది. డీజిల్‌పై 37పైసలు పెరిగి లీటర్ రూ101.78కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర 34పైసలు పెరిగి రూ.105.76కి చేరింది. డీజిల్‌పై 35పైసలు పెరిగి 96.98కి చేరింది.

చదవండి :  కాబూల్‌కు విమాన సర్వీసులు నిలిపేసిన పాక్

తెలంగాణ ఫ్యూయల్ ధరలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 35పైసలు పెరిగి రూ.109.37 ఇక డీజిల్‌పై 38పైసలు పెరిగి 102.42కి చేరింది. కరీంనగర్‌లో పెట్రోల్‌పై 36పైసలు పెరిగి రూ.109.13కి చేరింది డీజిల్‌పై 39పైసలు పెరిగి రూ.102.15 చేరింది.

ఆంధ్ర ప్రదేశ్ ఫ్యూయల్ ధరలు

విజయవాడలో పెట్రోల్‌పై 40పైసలు పెరిగి రూ.111.04 ఇక డీజిల్ పై 39పైసలు పెరిగి 103.88కి చేరింది.