×
Ad

Apple Watch Series 7 : ఇండియాలో ఈ రోజు నుంచే ఆపిల్ వాచ్ సిరీస్ 7 ప్రీ-ఆర్డర్లు..!

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త వాచ్ సిరీస్ 7 ప్రీఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 8న సాయంత్రం 5.30 గంటల నుంచి భారత మార్కెట్లో ప్రీఆర్డర్లు మొదలవుతాయి.

  • Published On : October 8, 2021 / 05:05 PM IST

Apple Watch Series 7 Pre Orders In India Start Today

Apple Watch Series 7 Pre-Orders in India  : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త వాచ్ సిరీస్ 7 ప్రీఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 8న సాయంత్రం 5.30 గంటల నుంచి భారత మార్కెట్లో ప్రీఆర్డర్లు మొదలవుతాయి. ఆపిల్ ఇండియా స్టోర్ ఆన్‌లైన్ (Apple India Store Online), దేశంలోని ఆపిల్ అధికారిక రీసెలర్ల వద్ద ఆపిల్ వాచ్ సిరీస్ 7 ప్రీఆర్డర్ చేసుకోవచ్చు. గత నెలలోనే ఇండియాలో iPhone 13 సిరీస్ ఫోన్ తో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 7 లాంచ్ చేసింది. ఆపిల్ వాచ్ IP6X డస్ట్ రెసిస్టెంట్ డిజైన్, భారీ డిస్‌ప్లే 41mm, 45mm సైజు ఆప్షన్ వంటి ఫీచర్లతో అందిస్తోంది. ఈ ఆపిల్ వాచ్ సిరీస్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 6 కు ఇది అప్ గ్రేడ్ వెర్షన్.
Air India-Tata Sons : టాటాల చేతికే ఎయిరిండియా..అధికారికంగా ప్రకటించిన కేంద్రం

అక్టోబర్ 15 నుంచి ఆపిల్ వాచ్ సిరీస్ 7 సేల్ ప్రారంభం కానుంది. భారత మార్కెట్లో ఆపిల్ వాచ్ సిరీస్ 7 ధర రూ.41,900గా నిర్ణయించింది. ఈ రోజు నుంచే ఆపిల్ వాచ్ సిరీస్ 7 ప్రీఆర్డర్లు మొదలు కానున్నాయి. ఇండియాతో పాటు కొత్త యాపిల్ వాచ్ సిరీస్ ప్రీ-ఆర్డర్లు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌత్ కొరియా, యూఏఈ, యూకే, అమెరికా సహా 50కు పైగా ఇతర దేశాల్లో ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమయ్యాయి.

ఆపిల్ వాచ్ సిరీస్ 7 ఐదు అల్యూమినియం కేస్ ఫినిషెస్ తో అందుబాటులోకి వచ్చింది. గ్రీన్ మిడ్ నైట్, న్యూబ్లూ, స్టార్ లైట్, (PRODUCT)RED ఆప్షన్లలో అందుబాటులో ఉంది. స్టెయిన్ లెస్ స్టీల్ మోడల్స్ గోల్డ్, గ్రాఫైట్, సిల్వర్ కలర్లలో అందుబాటులో ఉండనున్నాయి.

ఆపిల్ వాచ్ ఎడిషన్ లో స్పేస్ బ్లాక్ టైటానియం, టైటానియం షేడ్స్ లో అందుబాటులో ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 7 ధర మోడల్ వైజుగా ఎంత ఉంటుందో ఆపిల్ రివీల్ చేయలేదు. ఆల్యుమినయంతో తయారైన ఆపిల్ వాచ్ సిరీస్ 7 GPS మోడల్ వేరియంట్ (41mm) సైజు ఆప్షన్‌తో వచ్చింది. ఈ మోడల్ ఆపిల్ వాచ్ ధర ఈ-కామర్స్ వెబ్ సైట్లో రూ.44,900కు అందుబాటులో ఉండనుంది.
Samantha : ఎఫైర్లు, అబార్షన్లపై సమంత ఘాటు స్పందన