Apple Watch Ultra : ఈ ఆపిల్ వాచ్ అల్ట్రా.. ఎంత స్ట్రాంగ్ తెలుసా? సుత్తితో వాచ్‌పై బాదితే టేబుల్ విరిగిపోయింది..!
Apple Watch Ultra : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నుంచి కొత్త ఆపిల్ వాచ్ అల్ట్రా (Apple Watch Ultra) వచ్చింది. అయితే ఈ ఆపిల్ వాచ్ చాలా స్ట్రాంగ్ అని కంపెనీ చెబుతోంది. ఇంతకీ ఆపిల్ చెప్పేది నిజమా? అబద్దమా? అనే సందేహం చాలామందికి రాకమానదు.

Apple Watch Ultra durability tested with hammer, table broke before the watch
Apple Watch Ultra : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నుంచి కొత్త ఆపిల్ వాచ్ అల్ట్రా (Apple Watch Ultra) వచ్చింది. అయితే ఈ ఆపిల్ వాచ్ చాలా స్ట్రాంగ్ అని కంపెనీ చెబుతోంది. ఇంతకీ ఆపిల్ చెప్పేది నిజమా? అబద్దమా? అనే సందేహం చాలామందికి రాకమానదు. అందుకే ప్రముఖ యూట్యూబర్ ఆపిల్ వాచ్ అల్ట్రా ఎంత స్ట్రాంగ్ అనేది టెస్టింగ్ చేశాడు. ఆపిల్ ఇటీవలే iPhone 14 లాంచ్ ఈవెంట్‌లో కొత్త వాచ్ కేటగిరీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఎలాంటి వాతావరణంలోనైనా ఈ ఆపిల్ వాచ్ అల్ట్రా తట్టుకోగలదని కంపెనీ తెలిపింది. అత్యంత కఠినమైన ఆపిల్ వాచ్ కూడా స్పష్టం చేసింది. ఆపిల్ వాచ్ అల్ట్రాను సాహసికులు, అన్వేషకులకు అత్యుత్తమ టెక్నికల్ టూల్ అని కంపెనీ పేర్కొంది. వేరబుల్ MIL-STD-810H సంబంధిత అంశాలకు ధృవీకరించింది. మిలిటరీ డివైజ్‌ల కోసం ఈ వాచ్ అల్ట్రా తీసుకొచ్చినట్టు Apple చెబుతోంది.

Apple Watch Ultra durability tested with hammer, table broke before the watch
స్మార్ట్ వాచ్‌లో టైటానియం కేస్, నీలమణి ఫ్రంట్ క్రిస్టల్ గ్లాస్ పూత వేశారు. యూట్యూబర్ (టెక్‌రాక్స్ ఛానెల్‌తో) Apple వాచ్ అల్ట్రాను టెస్టింగ్ చేశాడు. టెస్టింగ్‌లో భాగంగా వాచ్ మొదట నాలుగు అడుగుల ఎత్తు నుంచి పడేశాడు. అప్పుడు టైటానియం కేసులో చిన్న గీతలు కనిపించాయి.
ఆ తర్వాత ఓ భారీ కూజాలోకి విసిరివేశాడు. కానీ, డిస్‌ప్లే లేదా కేస్ ఎలాంటి గీతలు పడలేదు. అయినప్పటికీ, బెల్ట్ కొంచెం బురదగా మారింది. చివరిగా టెస్టులో సుత్తిని ఉపయోగించి పరీక్షించాడు. వాచ్ డిస్‌ప్లేను దాదాపు 1 లేదా 2 సార్లు సుత్తితో కొట్టాడు.. అయినా ఆపిల్ వాచ్ అల్ట్రా అసలే పగలలేదు.

Apple Watch Ultra durability tested with hammer, table broke before the watch
మరికొన్నిసార్లు బలంగా సుత్తితో బాదాడు. ఆ దెబ్బలకు వాచ్ ఉంచిన టేబుల్ విరిగిపోయింది.. కానీ, వాచ్ మాత్రం చెక్కు చెదరలేదు. దాదాపు 7 సార్లు సుత్తితో కొట్టడంతో వాచ్ పనిచేయడం ఆగిపోయింది. వాచ్ పని చేయడంలో కొన్ని ఇంటర్నల్ పార్టులు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు 10 ప్రయత్నాలు తర్వాత వాచ్ డిస్‌ప్లే, కేస్ విరిగిపోయాయి.

Apple Watch Ultra durability tested with hammer, table broke before the watch
ఆపిల్ వాచ్ అల్ట్రా 2-3 సార్లు బలంగా బాదినా తట్టుకోగలిగిందని గుర్తించాడు. ఈ వీడియోలో చాలా స్ట్రాంగ్ వాచ్ అని వినియోగదారులకు అర్థమైపోయింది. భారత మార్కెట్లో Apple వాచ్ అల్ట్రా చాలా ఖరీదైనది కూడా. దీని ప్రారంభ ధర రూ. 89,900గా ఉంది. స్మార్ట్ వాచ్ ఇప్పటికే సేల్ అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు Apple.in, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.