Apple WWDC 2025 : ఆపిల్ బిగ్ ఈవెంట్.. కీనోట్ ఎప్పుడు? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి? ఏయే కొత్త అప్‌డేట్స్ ఉండొచ్చంటే?

Apple WWDC 2025 : WWDC 2025 కీనోట్ జూన్ 9న రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆపిల్ ప్లాట్‌ఫామ్‌లలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.

Apple WWDC 2025

Apple WWDC 2025 : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. టెక్ దిగ్గజం వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2025) ఈవెంట్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కీనోట్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ప్రకటించనున్నారు. ఈ ఏడాది చివరిలో ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్ డివైజ్, ఇతర ఆపిల్ డివైజ్‌లు అందుబాటులో ఉంటాయి.

Read Also : Motorola Edge 50 : మోటోరోలా ఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. భారీ డిస్కౌంట్ మీకోసమే.. ఇంత తక్కువలో మళ్లీ దొరకదు..!

రాబోయే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ గురించి అధికారిక వివరాలు రివీల్ చేయలేదు. కానీ, నివేదికల ప్రకారం.. భారీ డిజైన్లు, కొత్త ఫీచర్లు, రీబ్రాండ్ వంటి కొత్త మార్పులు ఉండవచ్చు. ఇంతకీ ఈ WWDC 2025 ఈవెంట్ ఎప్పుుడు ప్రారంభం కానుంది. ఎన్ని రోజులు జరుగుతుంది.. ఒకవేళ లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే ఏం చేయాలి? WWDC 2025 తేదీ, ఇండియా కీనోట్ టైమింగ్స్ వంటి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

WWDC 2025 డేట్, టైమ్ వివరాలివే :
జూన్ 9న WWDC 2025 ఈవెంట్ ప్రారంభమై శుక్రవారం, జూన్ 13న ముగుస్తుంది. ఈ ఆపిల్ ఈవెంట్ దుబాయ్‌లో రాత్రి 10:30 గంటలకు, EDT మధ్యాహ్నం 1:00 గంటలకు, GST రాత్రి 9:00 గంటలకు, యూకేలో BST సాయంత్రం 6:00 గంటలకు, భారత కాలమానం ప్రకారం.. రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది.

WWDC 2025 : లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి? :
మీరు ఆపిల్ అభిమాని అయితే.. ఆపిల్ WWDC 2025 నేరుగా ఆపిల్ యూట్యూబ్ ఛానెల్, అధికారిక వెబ్‌సైట్, డెవలపర్ యాప్, వెబ్‌సైట్‌లో చూడవచ్చు. అభిమానులు ఆపిల్ టీవీ యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

WWDC 2025 బిగ్ అప్‌డేట్స్ ఏం ఉండొచ్చు :
ఆపిల్ iOS 26, iPadOS 26, macOS Tahoe, watchOS 26, visionOS 26 వంటి ఆపరేటింగ్ అప్‌డేట్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇవన్నీ విజన్ ప్రో మాదిరిగా కొత్త “డిజిటల్ గ్లాస్” డిజైన్ లాంగ్వేజ్‌తో ఉంటాయి. మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం.. సఫారీ, కెమెరా, మెసేజ్‌లు, లాంగ్ టైమ్ ఫోన్ యాప్ కొన్ని భారీ మార్పులతో రావచ్చు. ట్రాన్సులేషన్, లైవ్ కాల్ ట్రాన్స్‌క్రిప్షన్‌లు, జెన్మోజీ అప్‌డేట్‌లు, షార్ట్‌కట్‌లలో కొన్ని అప్ గ్రేడ్స్‌తో వచ్చే అవకాశం ఉంది.

Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వేతనాలు.. గ్రేడ్ వారీగా ఎంత ఉండొచ్చంటే?

ఆపిల్ డెవలపర్‌లకు సొంత యాప్‌లలో ఏఐ ఫీచర్లను ఇంటిగ్రేట్ చేసేందుకు ఆపిల్ ఫౌండేషన్ మోడళ్లకు యాక్సెస్‌ను అందించవచ్చు. కంపెనీ ఏఐ-ఆధారిత బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ను కూడా ప్రవేశపెట్టవచ్చు. సిరి అప్‌డేట్స్, ఏఐ హెల్త్ ఫీచర్‌ల వంటి భారీ అప్‌గ్రేడ్‌లు ఈ ఏడాదిలో లాంచ్ అయ్యే పరిస్థితి లేదు. విజన్ ప్రో ఐ-స్క్రోలింగ్, కంట్రోలర్ సపోర్ట్ వంటి కొన్ని అప్‌గ్రేడ్స్ పొందే అవకాశం ఉందని చెబుతున్నారు.