8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వేతనాలు.. గ్రేడ్ వారీగా ఎంత ఉండొచ్చంటే?
8th Pay Commission : 8వ వేతన సంఘంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరగనున్నాయి. గ్రేడ్‌ల వారీగా ఎవరి వేతనం ఎంత పెరగనున్నాయంటే?

8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘం ద్వారా కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరగనున్నాయి. (8th Pay Commission) జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రానుందని భావిస్తున్నారు. అయితే, పే స్కేళ్లను లెక్కించేందుకు ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ తప్పనిసరి.
7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండగా 8వ వేతన సంఘంలో 2.86కి పెరిగే అవకాశం ఉంది. దాంతో కనీస ప్రాథమిక వేతనం రూ. 18వేల నుంచి రూ. 51,480కి, పెన్షనర్లకు రూ. 9వేల నుంచి రూ. 25,740కి పెంచే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీగా మార్పులు రానున్నాయి.
అంతేకాదు.. 8వ వేతన సంఘం అమలుతో దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆర్థిక ప్రయోజనం పొందనున్నారు. ఇంతకీ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు గ్రేడ్‌ల వారీగా ఎంత పెరగనున్నాయంటే?
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వల్ల జీతం ఎంత పెరుగుతుంది? :
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది బేసిక్ శాలరీ ఆధారంగా లెక్కిస్తారు. ఈసారి 2.28 నుంచి 2.86 మధ్య ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుత బేసిక్ శాలరీ రూ. 18వేల అయితే రూ. 41వేల నుంచి రూ. 51వేల వరకు పెరగవచ్చు.
అంటే.. జీతంలో 40 శాతం నుంచి 50శాతం వరకు పెరుగుదల ఉండవచ్చు. పెన్షనర్లు కూడా ప్రయోజనం పొందుతారు. పెన్షన్ పొందేవారు కూడా ప్రత్యక్ష ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ. 9వేలు ఉన్నవారి పెన్షన్ రూ. 20వేలకి పెరగవచ్చు. ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు కూడా ఇదే ప్రయోజనాలు పొందుతారు.
రివైజడ్ అలవెన్సులు, బేసిక్ శాలరీ (అంచనా) :
బేసిక్ శాలరీ సర్దుబాట్లతో పాటు ఇంటి అద్దె భత్యం (HRA), ట్రావెల్ అలవెన్స్ (TA) వంటి ఇతర భత్యాలను కూడా లొకేషన్, ఉద్యోగ సంబంధిత ప్రయాణాల ఆధారంగా సవరిస్తారు. ఒకే జీతం స్థాయిలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు వేర్వేరు భత్యాలతో వేర్వేరుగా గ్రాస్ శాలరీను పొందుతారు.
NPS, CGHS కాంట్రిబ్యూషన్స్ (అంచనా) :
జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) : ప్రభుత్వ ఉద్యోగులు తమ కనీస వేతనం, కరవు భత్యం (DA)లో 10 శాతం NPSకి జమ చేస్తారు. అయితే, కేంద్ర ప్రభుత్వం 14శాతం జమ చేస్తుంది. వేతన సవరణల తర్వాత మరింత పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) సవరించిన వేతన స్థాయిల ఆధారంగా CGHS కింద ఛార్జీలు ఉంటాయి.
వేతన సవరణలు (అంచనా) :
2.28 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో (8th Pay Commission) వివిధ గ్రేడ్‌లకు వేతనాల లెక్కింపు అంచనా వివరాలివే :
గ్రేడ్ 2000 (లెవల్ 3) : కనీస వేతనం రూ. 57,456కు సవరించింది. HRA, TA గ్రాస్ శాలరీ రూ. 74,845కు చేరుకుంది. డిడెక్షన్స్ తర్వాత నెట్ శాలరీ : రూ. 68,849.
గ్రేడ్ 4200 (లెవల్ 6): కనీస వేతనం రూ.93,708కి సవరించింది. గ్రాస్ శాలరీ రూ.1,19,798కి చేరుకుంది. డిడెక్షన్స్ తర్వాత నెట్ శాలరీ : సుమారు రూ.1,09,977.
గ్రేడ్ 5400 (లెవల్ 9): రివైజడ్ బేసిక్ శాలరీ రూ. 1,40,220, మొత్తం గ్రాస్ శాలరీ రూ. 1,81,073. టేక్-హోమ్ శాలరీ : దాదాపు రూ. 1,66,401.
గ్రేడ్ 6600 (స్థాయి 11): రివైజడ్ శాలరీ రూ. 1,84,452, గ్రాస్ శాలరీ రూ. 2,35,920కి చేరుకుంది. డిడెక్షన్స్ తర్వాత నెట్ శాలరీ : రూ. 2,16,825.
కొత్త 8వ వేతన కమిషన్ అమలు ఎప్పుడంటే? :
చాలా వేతన కమిషన్లు ఐదు ఏళ్ల కాలానికి వర్తిస్తాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. 8వ వేతన కమిషన్ సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి రావచ్చు. కానీ, ఇంకా అధికారిక తేదీని నిర్ణయించలేదు. ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లను ప్రత్యక్షంగా ప్రభావితమవుతారు. 8వ వేతన సంఘం నిర్ణయంతో ఉద్యోగుల జీతం పెరగనుంది. ఈసారి సిఫార్సులు మునుపటి కమిషన్ల కన్నా మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు.