Assam TET 2024 Admit Cards : అస్సాం టెట్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

Assam TET 2024 Admit Cards : అధికారిక నోటీసు ప్రకారం.. అస్సాం టెట్ పరీక్ష డిసెంబర్ 29న జరుగుతుంది. రెండు పరీక్ష పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 2 గంటల 30 నిమిషాల పాటు నిర్వహించనున్నారు.

Assam TET 2024 Admit Cards

Assam TET 2024 Admit Cards : డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అస్సాం అస్సాం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) రిక్రూట్‌మెంట్ పరీక్ష 2024 కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు (madhyamik.assam.gov.in)లోని అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ అడ్మిట్ కార్డులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసేందుకు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వంటి వారి లాగిన్ వివరాలు తప్పనిసరిగా ఉండాలి.

అధికారిక నోటీసు ప్రకారం.. అస్సాం టెట్ పరీక్ష డిసెంబర్ 29న జరుగుతుంది. రెండు పరీక్ష పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 2 గంటల 30 నిమిషాల పాటు నిర్వహించనున్నారు. ఒక్కో పేపర్‌లో 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. అంధ అభ్యర్థులు పరీక్ష రాయడానికి అదనంగా 20 నిమిషాలు ఉంటుంది.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డుతో పాటు (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి వంటివి అడ్మిట్ కార్డ్ హార్డ్ కాపీని తీసుకెళ్లాలి. పీడబ్ల్యుబీడీ (వికలాంగులు) అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సర్టిఫికేట్‌గా గుర్తించిన డాక్యుమెంట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

అస్సాం టెట్ 2024 అడ్మిట్ కార్డ్ ఎలా చెక్ చేయాలి? :

  • బయటకు వచ్చిన తర్వాత అభ్యర్థులు హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు అస్సాం టెట్ అధికారిక వెబ్‌సైట్ (madhyamik.assam.gov.in)కి వెళ్లాలి.
  • హోమ్‌పేజీకి చేరుకున్న తర్వాత ‘అస్సాం టెట్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్’ లింక్‌ని సెర్చ్ చేసి దానిపై క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ఆపై సబ్మిట్ క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీ అస్సాం టెట్ అడ్మిట్ కార్డ్ 2024 మీ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
  • అదే కాపీని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

అస్సాం టెట్ 2024 అడ్మిట్ కార్డ్.. పూర్తి వివరాలివే :

డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు తప్పనిసరిగా అస్సాం టెట్ అడ్మిట్ కార్డ్ 2024లో పేర్కొన్న కింది వివరాలను చెక్ చేయాలి. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, పరీక్ష తేదీ, రోల్ నంబర్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, పరీక్ష పేరు, రిపోర్టింగ్ టైమ్, పరీక్షా కేంద్రం పేరు, అడ్రస్ సహా పరీక్ష రోజు సూచనలు ఉంటాయి. ఏదైనా తేడా ఉన్నట్లయితే.. అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక అధికారులకు రిపోర్టు చేయాలి. వీలైనంత త్వరగా తప్పులను సరిదిద్దాలి.

Read Also : Realme 14x 5G Launch : భారీ బ్యాటరీతో రియల్‌‌మి 14ఎక్స్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఛార్జింగ్ వివరాలు లీక్..!