Smartphone’s Battery
Smartphone’s Battery: ఫోన్‌లో బ్యాటరీ తగ్గిపోవడం మొబైల్ ఫోన్ వినియోగదారులకు సమస్యే. అయితే ఈ సమస్యకు కారణం ఫోన్‌లో యాప్స్ కారణం అంటున్నారు టెక్ నిపుణులు. ఫోన్ బ్యాటరీ స్థాయి తక్కువ కావడానికి ఫోన్ యాప్స్ ఓ కారణం అని, ఫోన్-నిల్వ అనువర్తన సంస్థ pCloud చెబుతుంది. ఎంత బ్యాటరీ శక్తి అవసరమో అంతకంటే ఎక్కువగా యాప్స్ ఫోన్ నుంచి బ్యాటరీ తక్కువ అయ్యేందుకు కారణం అవుతున్నట్లుగా సంస్థ చెబుతుంది. ఫిట్‌బిట్, వెరిజోన్, ఉబెర్, స్కైప్ మరియు ఫేస్‌బుక్ వంటి ఐదు యాప్‌లు ముఖ్యంగా బ్యాటరీ తగ్గిపోవడానికి కారణం అవుతున్నట్లుగా చెబుతున్నారు.
సోషల్ మీడియా మరియు డేటింగ్ యాప్‌లు బ్యాటరీని తగ్గించడంలో ముఖ్యంగా పనిచేస్తున్నట్లుగా టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, యూట్యూబ్, వాట్సాప్ మరియు లింక్‌డిన్‌లు టాప్ 20లో ఉన్నాయి. ఈ యాప్‌లు అన్నీ 11 ఫీచర్లను బ్యాక్‌గ్రౌండ్‌లో అనుమతిస్తాయి.
బ్యాటరీ తగ్గిపోకుండా చూసుకోవాలంటే ముఖ్యంగా అతిగా ఛార్జింగ్ చేయడం ఆపేయాలి. నిద్రపోయేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఉదయం లేచేసరికి బ్యాటరీ 100శాతం అవుతుందని అనుకుంటారు. కానీ బ్యాటరీ వంద శాతం దాటిన తర్వాత ఛార్జింగ్ దానంతట అదే ఆగిపోతుంది. అతిగా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కి బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపిస్తుంది. నిద్రపోయే సమయంలో బ్యాటరీ పెట్టకూడదు. అలాగే 100శాతం బ్యాటరీ ఛార్జ్ అయ్యేవరకు కూడా ఛార్జింగ్ పెట్టకూడదు.. 95శాతం వరకు ఛార్జింగ్ అయితే చాలు.
కొన్నిసార్లు పొరపాటున స్మార్ట్‌ఫోన్స్‌లో వైఫై, బ్లూ టూత్ లాంటి ఆప్షన్లు ఆన్ అవుతాయి. ఇవి చాలా సమయం ఆన్‌లో ఉంటే ఈజీగా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. అవసరం ఉన్నప్పుడు వీటిని ఆన్ చేసుకోవాలి. వైఫై అందుబాటులో ఉన్నప్పుడు మొబైల్ డేటాను ఆఫ్ చేస్తే బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది. ఈ కామర్స్ వెబ్‌సైట్స్, యాప్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ కోసం అధికంగా జీపీఎస్ ఆప్షన్‌ను ఆన్ చేసి ఉంచడం వల్ల కూడా బ్యాటరీపై ఎఫెక్ట్ పడుతుంది.
Do you know which apps are the most demanding and take the vast majority of the space on your phone?https://t.co/uDrGhMOVTE pic.twitter.com/MABmNm2zlN
— pCloud (@pCloudapp) May 14, 2021