Battlegrounds Mobile India: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఐఓఎస్ రిలీజ్ డేట్ అప్పుడే..?
బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఐఓఎస్ వెర్షన్ రిలీజ్ డేట్ బయటికొచ్చేసింది. యాప్ రెడీ చేసిన క్రాఫ్టన్ యూజర్లలో హైప్ క్రియేట్ చేసేందుకు రిలీజ్ డేట్ ను లీక్ చేసింది. ఇప్పటివరకూ అందిన సమచారాన్ని బట్టి ఆగష్టు 20 నాటికి ఇండియా ఐఓఎస్ వర్షన్ ను రిలీజ్ చేస్తారు.

Battle Ground Mobile India
Battlegrounds Mobile India: బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఐఓఎస్ వెర్షన్ రిలీజ్ డేట్ బయటికొచ్చేసింది. యాప్ రెడీ చేసిన క్రాఫ్టన్ యూజర్లలో హైప్ క్రియేట్ చేసేందుకు రిలీజ్ డేట్ ను లీక్ చేసింది. ఇప్పటివరకూ అందిన సమచారాన్ని బట్టి ఆగష్టు 20 నాటికి ఇండియా ఐఓఎస్ వర్షన్ ను రిలీజ్ చేస్తారు.
గూగుల్ ప్లే స్టోర్ లో.. 48 మిలియన్, 49 మిలియన్, 50మిలియన్ డౌన్ లోడ్స్ రీచ్ అవడానికి చివరి కస్టమర్లకు రివార్డ్ ఇచ్చేందుకు ఈవెంట్ క్రియేట్ చేయనుంది క్రాఫ్టన్. ఇందులో భాగంగా 48మిలియన్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. 49మిలియన్ కూడా ముగియడంతో 50మిలియన్ డౌన్ లోడ్స్ పైన ఫోకస్ పెట్టారు. ఆగష్టు 20నాటికి అది కూడా పూర్తవుతుందని భావించి.. ఐఓఎస్ వెర్షన్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
జులైలో అధికారికంగా లాంచ్ అయిన బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా రెండు వారాల్లోనే ఆండ్రాయిడ్ యూజర్లను లక్షల్లో దక్కించుకుంది. ఐఫోన్ వెర్షన్ రిలీజ్ చేయమని అప్పుడు చెప్పలేదు కానీ, ఆ డెవలప్మెంట్ కోసం చాలా మంది ఎదురుచూశారు. ఈ మేరకు ఐఓఎస్ వెర్షన్ ను రెడీ చేసి క్రాఫ్టన్ ఎట్టకేలకు మరి కొద్ది రోజుల్లో రిలీజ్ చేసేస్తుందన్నమాట.
ఇక 48, 49, 50 మిలియన్ డౌన్‌లోడర్లకు ఇచ్చే రివార్డులు కూడా గేమ్ ఆడుకునేందుకు వచ్చే ఎక్స్‌ట్రా బెనిఫిట్సే. 50 మిలియన్ డౌన్ లోడర్ కు Permanent Galaxy Messenger Set x1 ఇచ్చి.. 48, 49 మిలియన్ డౌన్‌లోడర్లకు Coupon Crate Scrap x3ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇవి ఆండ్రాయడ్ యూజర్లకు మాత్రమే పరిమితం కాకుండా ఐఓఎస్ యూజర్లకు కూడా ఇస్తుందట క్రాఫ్టన్ మేనేజ్మెంట్.