Best 5G Phones 2025 : ఈ జనవరిలో రూ. 10వేల లోపు ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Best 5G Phones 2025 : ప్రస్తుతం 2025 జనవరిలో రూ. 10వేల కన్నా తక్కువ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ ధర పరిధిలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Best 5G Phones 2025 : ఈ జనవరిలో రూ. 10వేల లోపు ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Best 5G Phones to buy

Updated On : January 5, 2025 / 9:12 PM IST

Best 5G Phones 2025  : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో లాంగ్ లైఫ్ బ్యాటరీ, స్పీడ్ ఛార్జింగ్ కలిగిన అనేక 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అనేక బ్రాండ్‌లు సరసమైన ధరలకు ప్రొడక్టులను లాంచ్ చేశాయి. ప్రస్తుతం 2025 జనవరిలో రూ. 10వేల కన్నా తక్కువ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ ధర పరిధిలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

1) మోటో జీ35 5జీ :
మోటో జీ35 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 1,000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, ఫోన్ 6ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా యూనిసోక్ టీ760 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.

Read Also : Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!

గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం మాలి-జీ57 ఎంసీ4 జీపీయూతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 4జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తుంది. మోటో జీ35 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా మోటోరోలా కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. లెనోవో సబ్-బ్రాండ్ 2 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా, ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ షూటర్ ఉంది. డివైజ్ అన్‌లాక్ చేయడానికి ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. డాల్బీ అట్మోస్‌తో 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. నీటి స్ప్లాష్‌లు, తేలికపాటి వర్షం నుంచి ఫోన్‌ను ప్రొటెక్ట్ చేసేందుకు ఐపీ52 రేటింగ్ కలిగి ఉంది.

2) ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ :
ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల నిర్వహణకు మాలి జీ57 ఎంసీ2 జీపీయూతో వస్తుంది. 8జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 1టీబీ వరకు స్టోరేజ్ విస్తరణకు సపోర్టు ఇస్తుంది.

ఆప్టికల్‌ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 48ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్582 ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసేందుకు 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. పోకో హాట్ 50 5జీ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. 18డబ్ల్యూ వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన ఎక్స్ఓఎస్14.5పై రన్ అవుతుంది. వెట్ టచ్ రెసిస్టెన్స్ ఫీచర్‌కు సపోర్ట్‌తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ కూడా ఉంది.

3) పోకో సి75 5జీ :
పోకో సి75 6.88-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో గరిష్టంగా 600నిట్స్ వరకు బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ హెలియో జీ81 అల్ట్రా ప్రాసెసర్ ఎఆర్ఎమ్ మాలి జీ52 జీపీయూపై రన్ అవుతుంది. గరిష్టంగా 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ5.1 స్టోరేజీకి సపోర్టు ఇస్తుంది (మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు). ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ షూటర్, సెకండరీ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 13ఎంపీ షూటర్ కూడా ఉంది. ఈ పోకో ఫోన్ 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,160mAh బ్యాటరీతో వస్తుంది.

4) వివో టీ3 లైట్ :
వివో టీ3 లైట్ 5జీ 90Hz రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.56-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5ఎమ్ఎమ్ జాక్, డస్ట్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్‌తో వస్తుంది. 6ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల నిర్వాహణకు మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో వస్తుంది.

6జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ5.1 స్టోరేజీకి సపోర్టు ఇస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు 1టీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌ని ఉపయోగించడం ద్వారా స్టోరేజీని మరింత విస్తరించుకోవచ్చు. కెమెరా వారీగా, టీ3 లైట్ 5జీ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, సెకండరీ 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో బ్యాక్ డ్యూయల్ షూటర్ సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 8ఎంపీ సెల్ఫీ షూటర్ కూడా ఉంది.

Read Also : LG Bendable Gaming Monitor : ఎల్జీ నుంచి ప్రపంచంలోనే ఫస్ట్ ఫోల్డబుల్ గేమింగ్ మానిటర్ ఆవిష్కరణ.. ఫీచర్లు వివరాలివే!